హాలీవుడ్‌లో ఊర్వశీ... ఊర్వశీ... | This is in tune with a new wish | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో ఊర్వశీ... ఊర్వశీ...

Published Thu, May 22 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

హాలీవుడ్‌లో ఊర్వశీ... ఊర్వశీ...

హాలీవుడ్‌లో ఊర్వశీ... ఊర్వశీ...

 ‘ఊర్వశీ.. ఊర్వశీ... టేకీటీజీ పాలసీ...’ అనే పాట వినగానే, ఓ ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లిపోతాం. ప్రభుదేవా, నగ్మా నటించిన ‘ప్రేమికుడు’లోని ఈ పాటను ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటే. ఇప్పటికీ ఈ పాటకున్న క్రేజ్ తగ్గలేదు. అందుకు ఓ ఉదాహరణ చెప్పాలంటే.. ప్రపంచ సంగీతప్రియులకు సుపరిచితుడైన రాపర్ విల్.ఎ.యామ్ ‘ఊర్వశి...’ పాటను ఆదర్శంగా తీసుకుని, ‘బర్త్‌డే..’ అనే పాట తయారు చేశారు. దీని గురించి రహమాన్ మాట్లా డుతూ -‘‘విల్.ఐ.యామ్‌తో కలిసి ‘ఊర్వశి...’ పాట ట్యూన్‌ని పునసృష్టించడం ఆనందంగా ఉంది. కొత్త ఫ్లేవర్‌లో ఈ ట్యూన్ సాగుతుంది’’ అన్నారు. స్వతహాగా రచయిత అయిన విల్.ఎ.యామ్‌తో కలిసి     ఈ ‘బర్త్‌డే’ పాటను రహమాన్ రాశారు. ఈ పాట ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. జూలై 6 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement