ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం? | Actress Sridevi Sisters Rare Old Pic Who Acted With Chiranjeevi | Sakshi
Sakshi News home page

Guess The Actress: నలుగురు సిస్టర్స్.. అందరూ తెలుగులో మూవీస్ చేశారు!

Published Tue, Feb 27 2024 7:09 PM | Last Updated on Tue, Feb 27 2024 7:16 PM

Actress Sridevi Sisters Rare Old Pic Who Acted With Chiranjeevi - Sakshi

ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎం‍ట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)

చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement