1. ‘దీవానా’ చిత్రం ద్వారా హీరో అయిన బాలీవుడ్ ప్రముఖ నటుడెవరు?
ఎ) ఆమీర్ ఖాన్ బి) సల్మాన్‌ఖాన్ సి) షారుక్‌ఖాన్ డి) సోహైల్ ఖాన్
2. సూపర్‌స్టార్ కృష్ణ తన నట జీవితంలో ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారో తెలుసా?
ఎ) 19 బి) 14 సి) 10 డి) 17
3. చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పని చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) ఏ.ఆర్.రెహమాన్ బి) యస్.యస్. తమన్ సి) మణిశర్మ డి) దేవిశ్రీ ప్రసాద్
4. రణŠ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఆ చిత్రంలో నటిస్తున్న తెలుగు హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) రాజశేఖర్ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) నాని
5. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘పైసా’ చిత్రంలో నాని సరసన నటించిన హీరోయిన్ ఎవరు?
ఎ) రెజీనా బి) క్యాథరిన్ సి) ప్రణీత డి) హెబ్బా పటేల్
6. ‘సాహసవీరుడు– సాగరకన్య’ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) శిల్పాశెట్టి బి) రవీనా టాండన్ సి) దీప్తి భట్నాగర్ డి) నగ్మా
7. ‘సతీ లీలావతి’ చిత్రంలో కమల్‌హాసన్ సరసన నటించిన నటి ఎవరో తెలుసా?
ఎ) ఊర్వశి బి) కోవై సరళ సి) హీరా డి) రమ్యకృష్ణ
8. ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా.. గోవిందా హరి గోవిందా...’ అనే పాటను రచయిత ఎవరో గుర్తుందా?
ఎ) శ్రీశ్రీ బి) దాశరథి సి) సముద్రాల డి) కృష్ణశాస్త్రి
9. ‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...’ అక్కినేని సూపర్íß ట్ సాంగ్ ఏ చిత్రంలోనిదో తెలుసా?
ఎ) ప్రేమాభిషేకం బి) ప్రేమనగర్ సి) మేఘ సందేశం డి) దసరా బుల్లోడు
10. నాగార్జున హీరోగా నటించిన మొదటి చిత్రానికి దర్శకుడెవరో తెలుసుకుందామా?
ఎ) బోయిన సుబ్బారావు బి) వి.మధుసూదన్ రావు సి) దాసరి నారాయణరావు డి) కె.రాఘవేంద్రరావు
11. ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) రియా సుమన్ బి) పాయల్ రాజ్‌పుత్ సి) రష్మికా మండన్నా డి) కావ్యా థాపర్
12. ‘నిన్నుకోరి’ చిత్ర దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో హీరో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ నూతన చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కథానాయిక ఎవరు?
ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) సమంతా అక్కినేని సి) తమన్నా డి) రాశీ ఖన్నా
13. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ తేజ ఏ చిత్రానికి 6 నంది అవార్డులు అందుకున్నారో తెలుసా?
ఎ) చిత్రం బి) జయం సి) నువ్వు నేను డి) నిజం
14. ఈమె ప్రముఖ నటి. ఆమె నిజమైన పేరు శ్రీలతారెడ్డి. మరి.. స్క్రీన్ నేమ్ ఏంటో తెలుసా?
ఎ) విజయశాంతి బి) రోజా సి) జీవిత డి) వాణీ విశ్వనా«ద్
15. ‘రోబో’ చిత్రంలోని ‘ఓ మరమనిషి నాలోకి రా! ఇనుములో హృదయం మొలిచెనే....’ పాటను పాడిందెవరో తెలుసా?
ఎ) యస్పీ బాలసుబ్రహ్మణ్యం బి) కార్తీక్ సి) కారుణ్య డి) హేమచంద్ర
16. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సూత్రధారులు’ చిత్రంలో నటించిన ప్రముఖ కథానాయిక ఎవరు?
ఎ) జయప్రద బి) రమ్యకృష్ణ సి) మీనా డి) శోభన
17. ‘కొండవీటి సింహం’ చిత్రంలో యన్టీఆర్ కుమారునిగా నటించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) శ్రీధర్ బి) హరికృష్ణ సి) శోభన్ బాబు డి) మోహన్ బాబు
18. సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రంలో తన చిన్నప్పటి పాత్రను చేసిన చరిత్ మానస్ ఏ హీరో తనయుడో తెలుసా?
ఎ) రవితేజ బి) మహేశ్‌బాబు సి) సుధీర్‌బాబు డి) జయం రవి
19. రాజేంద్రప్రసాద్, రజనీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?
ఎ) అహ నా పెళ్లంట బి) మాయలోడు సి) ఏప్రిల్ 1 విడుదల డి) మేడమ్
20. ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి నటి ఎవరో చెప్పుకోండి?
ఎ) అనుష్కా శర్మ బి) చార్మి సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) భావన
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) బి 8) ఎ 9) బి 10) బి 11) సి
12) బి 13) సి 14) బి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) ఎ 20) బి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment