
అదీ సినిమా పాట. జూలీ సినిమాలో ఆ అందగత్తెను చూస్తూ అలాగే మొత్తుకుంటాడు హీరో. హెడ్ లైన్‌లో మేము రెండు సార్లు అన్నామంటే.. ఇప్పుడు మీరు చదువుతున్న వార్త జూలీ 2 గురించి. హిందీలో సూపర్‌స్టార్ ఖాన్‌తో తన మొదటి సినిమా చేసిన హీరోయిన్, పెళ్లయిన తమిళ్ సూపర్‌స్టార్‌తో అఫైర్ నడిపిన అమ్మాయి అని ఖ్యాతి చెందిన ఫిమేల్ స్టార్ జీవిత కథనమే జూలీ 2 అని ఆ సినిమా చేస్తున్నవాళ్లు చెప్పకపోయినా, ఇండస్ట్రీ అంతా జూలీ అయి కూస్తోంది. జూలీ 2 కథ మరి ఎవరిదనుకున్నారు? ఎస్. అవర్ నగ్మా మేడమ్! వెంటనే ఎవరో పోయి నగ్మాను కదిలించారట.. ‘ఈజ్ దిస్ ట్రూ?’ అని. ఇంగ్లిషులో అడిగినప్పుడు ఇంగ్లీషులోనే సమాధానం చెప్పుతుంది కదా.
‘ఓ ఈజిట్?’ దిస్ ఈజ్ న్యూస్ టు మి టూ. నిజమా. నేనూ ఫస్ట్ టైమ్ వింటున్నాను అని నగ్మా అన్నారట. ‘పద్మావతి’ సినిమానే పబ్లిసిటీ అంతా దండుకుంటోందని జూలీ 2 కి ఈ కొత్త యాంగిల్‌ని దండగా వేశారని అనుకుంటున్నారు. ఏమంటారు మేడమ్.. ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అని ఇంకోసారి అడిగితే.. సినిమా రిలీజ్ కాకుండా ఇలాంటి విషయాల మీద కామెంట్ చేయడం కరెక్టు కాదు అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment