న్యూ ఢిల్లీ: అలనాటి సినీ తార, ప్రస్తుత రాజకీయ నాయకురాలు నగ్మా వివాదాల్లో ఇరుక్కున్నారు. భారత్‌పై విషం కక్కుతూ మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు పలుకుతూ మాట్లాడటంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం నాడు ఓ హిందీ టీవీ ఛానల్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో నగ్మాతోపాటు తరీఖ్ పీర్జాదా అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో పాక్ జర్నలిస్ట్.. భారత్‌ఫై విషం కక్కుతూ తన మాతృ దేశాన్ని పొగడడం ప్రారంభించారు. దీంతో ఛానల్ ప్రతినిధి అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. (అందుకే సింధియా పార్టీ వీడారు : నగ్మా)
అలా మాట్లాడటం తగదని విమర్శించారు. కానీ నగ్మా మాత్రం పాక్ జర్నలిస్ట్‌ను ఎండగట్టాల్సిందిపోయి యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కించపరిచేందుకే డిబేట్‌కు ఆహ్వానించారా? అని మండిపడ్డారు. అనంతరం ట్విటర్‌లోనూ పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత్‌కు సపోర్ట్ చేయకుండా మన దేశానిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పాక్ జర్నలిస్టుకు మద్దతివ్వడం ఏంటని నెటిజన్లు నగ్మాని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆమె తన గౌరవాన్ని పోగొట్టుకుందని విమర్శిస్తున్నారు. తననే కాకుండా ఆమె కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఓ ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విటర్‌లో #NagmaStandsWithPakistan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. (కూతురికి కరోనా పేరు పెట్టిన ఎంపీ!)
Comments
Please login to add a commentAdd a comment