Janhvi Kapoor Poses With Rumoured Ex Boyfriend Akshat Rajan At Diwali Bash, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor : బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన జాన్వీ.. ఫోటో వైరల్‌

Published Thu, Oct 27 2022 11:00 AM | Last Updated on Thu, Oct 27 2022 11:42 AM

Janhvi Kapoor Poses With Ex Boyfriend Akshat Rajan At Diwali Bash - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మెప్పించినా కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం దక్కలేదు. స్టార్‌ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ లిస్టులోకి ఇంకా వెళ్లలేదు జాన్వీ.

మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేట్‌ చేసుకున్న జాన్వీ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. ఇందులో తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్‌ఫ్రెండ్‌ అక్షత్‌ రాజన్‌తో జాన్వీ క్లోజ్‌గా దిగిన ఓ ఫోటో కూడా ఉంది.

కొంతకాలం క్రితమే వీళ్లిదరు బ్రేకప్‌ చెప్పేసుకున్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట తెగ షికార్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ త్వరలోనే 'మిలి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement