Bigg Boss 6 Telugu: Sri Satya Reveals About Her Love, Engagement Break Up Story - Sakshi
Sakshi News home page

Bigg Boss 6-Sri Satya Break Up: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌.. అసలు కారణమిదే!

Published Wed, Sep 21 2022 12:43 PM | Last Updated on Wed, Sep 21 2022 3:31 PM

Bigg Boss 6 Telugu: Sri Satya Open Up Her Love and Engagement Break Up - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆమె తనదైన తీరుతో రాణిస్తోంది. టాస్క్‌లో చురుగ్గా ఉండకపోయిన.. ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే హౌజ్‌లో అందరితో కలవకపోవడం, తనకంటూ ఓ పరిధిని పెట్టుకున్న శ్రీసత్య దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఇటీవల సిసింద్రీ టాస్క్‌లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలని చెప్పింది.

చదవండి: విషాదం.. స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాత్సవ మృతి

తనకు బ్రేకప్‌ స్టోరీ ఉందని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. దీంతో తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ షాకింగ్‌ విషయం చెప్పింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన వాళ్ల అమ్మ ప్రస్తుతం ఆస్వస్థతకు గురైందని, తను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉందటూ కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీసత్య తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంటున్నాడు ఆమె మాజీ ప్రియుడు పవన్‌ రెడ్డి. శ్రీసత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్‌ రెడ్డి తన స్నేహితులతో చెప్పుకుని మండిపడ్డాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్‌

అయితే బిగ్‌బాస్‌ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్‌ ప్రోజెక్ట్‌ చేయడం పవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్‌ హౌజ్‌ అడుగుపెట్టడానికి ముందు ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన శ్రీసత్య బ్రేకప్‌పై స్పందించింది. టీనేజ్‌లో ఉన్నపుడు పవన్‌ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించానని, అయితే ఆ రిలేషన్‌ ఇప్పుడు బ్రేక్‌ అయ్యిందని తెలిపింది. ‘ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమను వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. అందుకే మా నిశ్చితార్థం రద్దయింది’ అని ఆమె పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement