
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ నటి సుష్మితా సేన్‌ల డేటింగ్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. వారిద్దరు జంటగా మాల్దీవులు, లండన్ చూట్టేసిన ఫొటోలను షేర్ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని ప్రకటించాడు లలీత్ మోదీ. సుష్మితా సైతం లలిత్ కుమార్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పటికి పెళ్లి, నిశ్చితార్థం జరగలేదు.. కానీ సంతోషంగా ఉన్నానని చెప్పింది.
చదవండి: Aadhi Pinisetty: మొదట్లో నిక్కీకి నాకు గొడవలు, మనస్పర్థలు.. ఆ తర్వాత..
అంతేకాదు షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందంటూ లలిత్‌తో డేటింగ్‌పై సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. దీంతో వీరిద్దర రిలేషన్‌పై బి-టౌన్‌లో ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. అలాగే ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ సైతం సుష్మితా తాజా ప్రేమపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. వారి ప్రేమ పట్ల మనం సంతోషంగా ఉందామని పిలుపునిచ్చాడు.
చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే!
‘ప్రేమ చాలా అందంగా ఉంటుంది. సుస్మితా ఎవరినైనా ఎంచుకుందంటే.. ఖచ్చితంగా అతడు చాలా విలువైనవాడు అయ్యింటాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా మూడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న సుష్మితా సేన్, రోహ్మాన్ షాల్‌లు ఇటీవల బ్రేకప్ చెప్పికున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సుష్మితా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ‘స్నేహితులుగా మా ప్రయాణం ప్రారంభమైంది. ఇకపైనా అలాగే ఉంటాం. రిలేషన్‌షిప్ ముగిసి చాలాకాలమైంది. ప్రేమ మాత్రం ఉంది’ అంటూ రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment