Lalith modi
-
లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది!
ఐపీలఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుష్మితతో తను ప్రేమలో ఉన్నట్లు లలిత్ మోదీ గత జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సుష్మితను తన జీవిత భాగస్వామిగా పేర్కొంటూ వారద్దరు వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేశాడు లలిత్ మోదీ. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబుతున్నారని అంతా అనుకున్నారు. దీంతో లేటు వయసులో ప్రేమ ఏంటని నెటిజన్లు వీరిని దారుణంగా ట్రోల్ చేయడంతో వీరి ప్రేమయాణంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ అయితా తాజాగా వీరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చట అయినట్లు తెలుస్తోంది. సుస్మితా, లలిత్ మోదీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టా బయోలో సుస్మితా పేరు తొలగించడమే. ఇది చూసి వీరిద్దరి విడిపోయారని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా గత జూలై 14న సుస్మితాతో తాను ప్రేమ ఉన్నట్లు ప్రకటించిన లలిత్ మోదీ.. తన ఇన్స్టాబయోలో సుస్మితని తన లైఫ్ పార్ట్నర్ పేర్కొన్నాడు. ఇన్‌స్టా బయోలో ‘ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫౌండర్ చివరికి తన లైఫ్ పార్ట్నర్ని కనుగొన్నాడు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ మై లవ్ సుష్మితా’(Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - finally starting a new life with my partner in crime. My love @sushmitasen47) అని రాశాడు. ఇర ఈ సోమవారం తన బయోలో సుస్మితా పేరు తొలగించి ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ (Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - Moon) అని మాత్రమే పెట్టాడు. అంతేకాదు సుష్మితాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా ప్రోఫైల్గా పెట్టుకున్న లలిత్ మోదీ ఆ ఫొటోని కూడా మర్చేయడం చర్చనీయాంశమైంది. ఇదంతా చూసి వారిద్దరు విడిపోయారా? అసలేం ఏం జరింగింది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్ రూమర్స్‌పై లలిత్ మోదీ, సస్మితాలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
లలిత్ మోదీతో డేటింగ్, మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా
గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమెపై తరచూ ఏదోక వార్త నెట్టింట సందడి చేస్తోంది. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు ఇటీవల లలిత్ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి డేటింగ్‌పై సోషల్ మీడియా తీవ్ర చర్చ జరిగింది. అంతేకాదు నెటిజన్ల నుంచి వీరు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుష్మితా తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు నేడు(ఆగస్ట్ 11) ఆమిర్ ఖాన్, నాగ చైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ రిలీజ్ నేపథ్యంలో నిన్న నిర్వహించిన ప్రీమియర్ షోకు సుష్మితా తన పిల్లలు రినీ సేన్, అలిషా సేన్లతో కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ కూడా కనిపించాడు. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహ్మాన్ సుస్మితా, ఆమె పిల్లలతో కలిసి చాలా సరదాగా కనిపించాడు. కాగా రోహ్మాన్తో బ్రేక్ప్ అనంతరం లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్న సుష్మితా మూవీ షోలో మాజీ ప్రియుడితో కనిపించడంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు కాగా రోహ్మాన్, సుష్మితాలు కొన్నేళ్ల డేటింగ్ అనంతరం గత డిసెంబర్లో బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆగస్ట్ 8న సుష్మితా తల్లి బర్త్‌డే వేడుకులో కూడా రోహ్మాన్ దర్శనం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు కలిసి జరపుకున్న ఈ వేడుకకు సంబంధించి లైవ్ వీడియో షేర్ చేసింది సుష్మితా. ఇందులో రోహ్మాన్, సుష్మితా పిల్లలతో కలిసి మాట్లాడుతూ కనిపించాడు. అయితే అందరు కెమెరా సైడ్ చూడండి అని సుష్మితా అనగానే రోహ్మాన్ ఫ్రేం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇది చూసి నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి మీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ లలిత్ మోదీ ఎక్కడ అంటూ సుస్మితాను ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇటీవల సుష్మితాను తన భాగస్వామిగా పేర్కొంటూ లలిత్ మోదీ ఫొటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిని త్రీవస్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమపై వస్తున్న ట్రోల్స్‌పై లలిత్ మోదీ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి’’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్? ‘గోల్డ్ డిగ్గర్’(డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి) అంటూ సుష్మితను సైతం ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా సుష్మితా సేన్ స్పందించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘ప్రస్తుతం నా జీవితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేస్తున్నాననేది నా వ్యక్తిగతం. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. చూట్టు ఉన్న ప్రపంచం దయనీయకంగా మారుతోంది. అది చూస్తుంటే నాకు జాలేస్తోంది. నేను ఎప్పుడు కలవని, అసలు పరిచయమే లేని మిత్రులు, కొంతమంది మేధావులు నా జీవితంపై హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేనే ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు. నేను ఓ గోల్డ్ డిగ్గర్ అంటూ నాపై కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. కానీ నేను బంగారం కంటే డైమంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయితే వాటిని నేను సొంతంగా కొనుక్కోగలను కూడా. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నా. ఇక మీ అందరు ఒక విషయం తెలుసుకోండి. మీ సుష్ బాగానే ఉందని తెలుసుకోండి. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా నాకు సపోర్ట్‌గా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ సుష్మితా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా లలిత్ మోదీతో సుష్మితా డేటింగ్ చేస్తున్న విషయం చెప్పినప్పటి నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బు కోసమే ఆయన సుష్మితా డేటింగ్ చేస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ ఆమె గత ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లో చర్చిస్తున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
లలిత్ మోదీతో డేటింగ్‌పై సుష్మితా మాజీ ప్రియుడి స్పందన
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ నటి సుష్మితా సేన్ల డేటింగ్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. వారిద్దరు జంటగా మాల్దీవులు, లండన్ చూట్టేసిన ఫొటోలను షేర్ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని ప్రకటించాడు లలీత్ మోదీ. సుష్మితా సైతం లలిత్ కుమార్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పటికి పెళ్లి, నిశ్చితార్థం జరగలేదు.. కానీ సంతోషంగా ఉన్నానని చెప్పింది. చదవండి: Aadhi Pinisetty: మొదట్లో నిక్కీకి నాకు గొడవలు, మనస్పర్థలు.. ఆ తర్వాత.. అంతేకాదు షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందంటూ లలిత్‌తో డేటింగ్‌పై సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. దీంతో వీరిద్దర రిలేషన్‌పై బి-టౌన్లో ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. అలాగే ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ సైతం సుష్మితా తాజా ప్రేమపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. వారి ప్రేమ పట్ల మనం సంతోషంగా ఉందామని పిలుపునిచ్చాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘ప్రేమ చాలా అందంగా ఉంటుంది. సుస్మితా ఎవరినైనా ఎంచుకుందంటే.. ఖచ్చితంగా అతడు చాలా విలువైనవాడు అయ్యింటాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా మూడేళ్ల పాటు రిలేషన్లో ఉన్న సుష్మితా సేన్, రోహ్మాన్ షాల్లు ఇటీవల బ్రేకప్ చెప్పికున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సుష్మితా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ‘స్నేహితులుగా మా ప్రయాణం ప్రారంభమైంది. ఇకపైనా అలాగే ఉంటాం. రిలేషన్షిప్ ముగిసి చాలాకాలమైంది. ప్రేమ మాత్రం ఉంది’ అంటూ రాసుకొచ్చింది. -
లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే!
ప్రస్తుతం బాలీవుడ్లో సుష్మితా సేన్- లలిత్ మోదీలో ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు.. కానీ సడెన్‌గా వీరిమధ్య ప్రేమ ఏంటని అంతా షాక్ అవుతున్నారు. ఇక కొందరు నెటిజన్లు అయితే లేటు వయసులో ఈ ఘాటూ ప్రేమ ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో సహాజీవనం, ఇప్పుడు ముసలోడితో ప్రేమ అంటూ సుష్మితాపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. చదవండి: బిగ్‌బాస్ క్రేజ్.. రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో? అంతేకాదు ఆమె గతంతో ఎవరెవరితో ప్రేమ వ్యవహారం సాగించిందో కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఆమె లలిత్ మోదీతో సహా 9 మందితో సహాజీవనం చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్ అయింది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులతో పాటు ఓ క్రికెటర్, నటులు, బడా వ్యాపారవేత్తలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో సుష్మితా పలువురు నటులు, క్రికెటర్, వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. చదవండి: ‘దళపతి’ విజయ్ కేసును ముగించిన హైకోర్టు అంతమందితో ప్రేమలో పడ్డ ఆమె కేవలం డేటింగ్ వరకు పరిమితమైంది. మొన్నటి దాక తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తోంది మూడేళ్లు సహాజీవనం చేసిన ఆమె గతంలో క్రికెటర్ వసీమ్ అక్రమ్, నటుడు రణ్‌దీప్ హుడా, డైరెక్టర్ విక్రమ్ భట్, ముద్దాసిర్, మానవ్ మీనన్‌లతో కొన్నేళ్ల పాలు సహాజీవనం చేసింది. ఇక బడా వ్యాపారవేత్తలైన రితిక్ ఖాసిన్, సబీర్, సంజయ్ నారంగ్, ఇంతియాజ్‌లతో కూడా గతంలో ఆమె డేటింగ్ చేసింది. కాగా ప్రస్తుతం సుష్మితా వయసు 46 కాగా.. లలిత్ మోదీ వయసు 56 ఏళ్లు. కాగా సుష్మితా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలను దత్తకు తీసుకుని తల్లైన సంగతి తెలిసిందే. -
బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ!
వ్యాపారం చేశారు... విజయాలు సాధించారు... కొందరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ వ్యాపారవేత్తల జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తల ‘బయోపిక్’కి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియల్ బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ చేస్తున్నారు సినీ బిజినెస్మెన్ అయిన నిర్మాతలు. ఇక ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం. మూడు తరాల టాటా కథ టాటా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటా. జమ్ షెడ్జీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన వారసులు బాధ్యతలు చేపట్టారు. వారిలో రతన్ టాటా ఒకరు. దేశంలో పేరున్న ఈ కుటుంబంపై సినిమా నిర్మించడానికి టీ సిరీస్ భూషణ్‌కుమార్ హక్కులు పొందారు. ‘ది టాటాస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టాటా కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యాపారవేత్తల కథతో ఈ సినిమా ఉంటుంది. ‘ది టాటాస్, హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్’ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకుడి ఎంపిక జరగలేదు. కాఫీ కింగ్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాకుడు వీజీ సిద్ధార్థ జీవితం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సిద్ధార్థ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళుతున్న ఆయన అనూహ్యంగా నదిలో శవం అయి తేలడం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ‘కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్థ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హిందీలో అక్షయ్‌కుమార్ ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పోట్రు’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధ. రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా సౌత్‌లో ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన సూర్య రీమేక్‌ని కూడా నిర్మించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకి ఇది తొలి చిత్రం అవుతుంది. విజయాలు.. వివాదాలతో... విజయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు కానీ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, రచయితగా గుల్జార్ వ్యవహరించనున్నారు. ‘దిల్ సే, గురు, యువరాజ్, స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలకు రెహమాన్, గుల్జార్ పని చేశారు. గుల్జార్ లాంటి అద్భుత రచయితతో మళ్లీ కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు. లలిత్ లైఫ్‌తో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ఐపీఎల్‌తో క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లలిత్ మోడీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్త వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని లలిత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘ఏదో పుస్తకం ఆధారంగా నాపై సినిమా తీస్తున్నారని విని ఆశ్చర్యపోయాను. దానికి, నాకూ ఎలాంటి సంబంధం లేదు. నా బయోపిక్ గురించి నేను స్వయంగా ప్రకటిస్తాను’’ అని లలిత్ పేర్కొన్నారు. విజయంతో వెలుగులోకి... ప్రముఖ అంధ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం వెండితెరకు రానుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. చూపు లేకపోయినా విజయంతో వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ జీవితం ఆధారంగా దర్శకురాలు తుషార్ హిద్రానీ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీకాంత్ బొల్లా పాత్రను రాజ్‌కుమార్ రావ్ పోషించనున్నారు. ఇవే కాదు.. మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తల బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా స్ఫూర్తిగా నిలిచే వ్యాపారవేత్తల జీవిత చిత్రాలంటే ఇంకా ఉంటుంది. అందుకే దర్శక–నిర్మాతలు రియల్ బిజినెస్మెన్ జీవితాలను రీల్‌పై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. -
ఓపీఎల్‌కు మోదీ, మాల్యా సారథ్యం!
ఢిల్లీ: మొన్న ఐపీఎల్ అవినీతి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లలిత్ మోదీ లండన్ పారిపోయారు. నిన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి భారతీయ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగవేసిన కేసులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ చెక్కేశారు. లండన్‌లో లలిత్ మోదీ పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయగా, భారత్ నుంచి మాల్యా పారిపోయేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ, విజయ్మాల్యాల వ్యవహారంలో సామీప్యతను సూచిస్తూ, వారి పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ట్విట్టర్లో వ్యంగోక్తులు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.... ‘లలిత్ మోదీని ఉద్దేశించి మాల్యా: నేనూ భారత అధికారులను ఫూల్స్‌ను చేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను. ఓవర్సీస్ ప్రీమియర్ లీగ్ (ఓపీఎల్)ను ఏర్పాటు చేసి మస్తుగా డబ్బులు సంపాదిద్దాం పా.... మళ్లీ లలిత్‌ను ఉద్దేశించి మాల్యా: ముందు నువ్వెళ్లు, వెనకాలే నేనొస్తా. సుష్మా స్వరాజ్ మనకు అండగా ఉన్నారు. స్మతి ఇరానీ కూడా సాయం చేస్తారు. మొత్తంగా నరేంద్ర మోదీ సహాయం మనకు ఎటూ పోదు.... మాల్యాను ఉద్దేశించి మోదీ: హార్నీ, నేనే పెద్ద ఫ్రాడ్ అనుకున్నాను. నాకన్నా నీవు సూపర్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్‌ను చట్టబద్ధం చేసే పార్టీని పెడదాం.....వారిద్దరితో ప్రజలు: కొత్త పార్టీ ఎందుకు? టోకున ఒక పార్టీ ఉండనే ఉందిగదా! బీజేపీలో చేరండి, జై మోదీ మస్తాన్!...అసహనం సాకు చెప్పండి, భారత్‌ను వదలి వెళ్లండి. కనీసం కుహనా లౌకికవాదుల మద్దతైనా దొరకుతుంది..... ఇద్దరు ఎన్నారైలే. ఒకరు భారత్‌కు తిరిగిరానివారు. మరొకరు భారత్‌కు తిరిగి చెల్లించనివారు.... లలిత్‌తో మాల్యా: ఐలవ్ యూ నేవీ నాకు ఇన్స్పిరేషన్....గ్రేట్ ఎస్కేప్, ఎస్కేప్ టు విక్చరీలతోపాటు షాశాంక్ రిడెంప్షన్ కూడా నాకు ఇష్టమైన చిత్రం.....సుష్మాకు ఫోన్ చేయ్? నేనూ భారత్ నుంచి పారిపోవాలి....హమ్ దోనోం చోర్ చోర్....’ -
క్రికెట్ లోకి వచ్చి.. మటాష్!
సునందా పుష్కర్, విజయ్ మాల్యా, శ్రీనివాసన్, ప్రీతి జింతా, రాజ్ కుంద్రా, వెంకటరామిరెడ్డి, సుబ్రతో రాయ్.. ఇంకా లలిత్ మోదీ. ఇంకొన్నాళ్లు ఆగితే ఈ జాబితా ఇంకాస్త పెద్దదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ మనం మాట్లాడుతున్నది దేని గురించో ఈ పాటికే అర్థమైంది కదా! అవును. 'క్రికెట్ కాసుల యంత్రం' ఐపీఎల్ గురించే! అప్పటిదాకా వారివారి రంగాల్లో ఘనులైన ఈ బడాబాబులందరూ క్రికెట్ లోకి అడుగుపెట్టాకే.. కాలు జారి పతనం అంచుల వరకు వెళ్లిపోయారు. పైన చెప్పుకున్న జాబితాలో ఒకరిద్దరు జైలులో మగ్గుతుండగా, ఇంకొందరు పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నారు. న్యాయవ్యవస్థపై అపార నమ్మకం వ్యక్తంచేస్తోన్న మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరు మాత్రం ఈ లోకంలో లేరు. క్రికెట్ వల్ల వీరికి శనిపట్టుకుందా? లేక వీళ్లే క్రీడలను భ్రష్టుపట్టించారా? అంటే.. ప్రొఫెషనల్ క్రికెట్ లోని మజాను ప్రేక్షకులకు అందించడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భాగంగా 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రారంభించింది. భారత క్రికెట్ కంట్రలోల్ బోర్డు (బీసీసీఐ). ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ పోటీల నమూనాలో తయారైన ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అయితే ఆటకంటే ఎక్కువ అవినీతికే అందలం లభించిందని ఐపీఎల్ పై తీవ్రవిమర్శ. జట్లను కొనుగోలుచేసేందుకు సినీ, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చడం ఆ క్రమంలో భారీగా నల్లధనం తెల్లగా(సక్రమంగా) మారిపోవడం, నిజానికి ఆపని కోసమే ఐపీఎల్ ఉద్భవించిందని మాట్లాడుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ లు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆరోపితులు నిందితులుగా మారుతుండటాన్నిబట్టి ఐపీఎల్ కచ్చితంగా జూదమేననే వాదనకు బలంచేకూరుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకులు, వీక్షకులు మాత్రం ఆటను ఆటలాగానే చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. అంతకు ముందరి ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ ఐపీఎల్ జట్లకు యజమానులైన తర్వాతే వ్యాపార దిగ్గజాలనుకున్నవారు ఒకొక్కరుగా కుప్పకూలిన వైనాన్ని పరిశీలిస్తే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. మాల్యా బ్యాంకులను బురిడీ కొట్టిస్తే.. పూణె వారియర్స్ జట్టు యజమాని, సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి, మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇక డెక్కన్ క్రానికల్ జట్టు యజమాని ,‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించిన దరిమిలా వాటి యజమానులైన శ్రీనివాసన్, మేయప్పన్, రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి, దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే విమర్శలున్నాయి. క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె చావుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరోరకం వివాదం. ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా, అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. నీతి కథలో విపత్తును ముందే గ్రహించే సుమతి చేపలాగా.. అవినీతికి సుత్రధారి అయిన లలిత్ మోదీ విషయం ఇంతదాకా వస్తుందని ముందే ఊహించారు. అందుకే వీళ్లందరికంటే ముందే బిచాణా సర్దేసి ఎంచక్కా విదేశాల్లో సెటిల్ అయ్యారాయన! సుదూరాల్లో ఉంటూ కూడా భారత పార్లమెంట్ ను షేక్ చెయ్యగల సత్తాఉన్న లలిత్ మోదీ.. ఐపీఎల్ ముసుగులో భారీ జూదానికి తెరలేపారని అంటే, ఎవరైనా కాదంటారా? -
లలిత్ మోదీ కేసులో ఇంటర్ పోల్ తకరారు
ముంబై/లిస్బన్: లలిత్ గేట్ కుంభకోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ మరో తకరారుకు తెరలేపింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కుంభకోణం వ్యవహారంలో లలిత్ మోదీ నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఉద్దేశపూర్వకంగా ఇరికించారా? మీరు మోపిన అభియోగాల్లో వాస్తవం ఎంత? ఆమేరకు ఆధారాలున్నాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారంలోగా సమాధానాలు చెప్పాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే ఆరోపణు ఎదుర్కొంటూ, ప్రస్తుతం విదేశం(పోర్చుగల్)లో నివసిస్తున్న లలిత్ మోదీపై ఈడీ గత ఆగస్టులో రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. దీంతో ఈ కేసులోకి ఇంటర్ పోల్ రంగప్రవేశం చేసింది. కాగా, ఒక కేంద్ర మంత్రి సహా కొందరు బీసీసీఐ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని, ఈడీ ఆరోపణల ఆధారంగా తనకు నోటీసులు జారీచెయ్యొద్దంటూ లలిత్ మోదీ ఇంటర్ పోల్‌ను కోరాడు. అతని అప్పీలును పరిశీలించిన ఇంటర్ పోల్.. కేసు ప్రేరితమా? కాదా? అంటూ మౌలిక ప్రశ్నలు లేవనెత్తింది. లలిత్ మోదీ అప్పీళ్లపై వచ్చేవారం విచారణ జరగనున్నందున ఆలోపే సమాధానాలు పంపాలని ఇంటర్ పోల్ కోరింది. 'సాధారణంగా తాను దర్యాప్తు చేసే కేసుల వివరాలను ఈడీ.. భారతీయ కోర్టులకు తప్ప ఇతర అంతర్జాతీయ సంస్థలకు వెల్లడించదు. అలాంటిది పదేపదే వివరాలు తెలపాలంటూ ఇంటర్ పోల్ ఈడీని కోరుతోంది. లలిత్ మోదీ ఏదో ఒక ఇష్యూను ఇంటర్ పోల్ ముందుంచడం, వాటికి సమాధానాలివ్వాలంటూ ఇంటర్ పోల్, ఈడీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఇదేదో కోర్టు విచారణ ఉందేకాని, దర్యాప్తుల సాగటంలేదు'అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)నే అయినప్పటికీ, భారత్‌లో ఇంటర్ పోల్ కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున ఆ సంస్థ ద్వారానే ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఈమేరకు ఈడీ నుంచి సమాచారం సేకరించి పంపాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. -
'మోదీ గేట్ లాంటి పదాలు వాడొద్దు'
న్యూఢిల్లీ : లోక్‌సభలో లలిత్ మోదీ అంశం మరోసారి దుమారం రేపింది. విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనతో బుధవారం సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే లలిత్ మోదీ అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్ర మహాజన్ తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అడ్డు పడ్డారు. ఆ సమయంలో సుష్మ స్వరాజ్ లేచి తాను చర్చకు సిద్ధమేనని..విపక్ష సభ్యులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. మరో పక్క పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రభుత్వం లలిత్ మోదీ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని ..విపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చుని సభ నడిచేందుకు సహకరిస్తే ప్రభుత్వం చర్చిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వాయిదా తీర్మానంపైనే చర్చ జరగాలని పట్టు బట్టారు. వాయిదా తీర్మానాలను పక్కనపెట్టడంతో పాటు అన్నిరకాల కార్యక్రమాలను వాయిదా వేయాలని, నేరుగా చర్చ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని పట్టు బట్టారు. చర్చ సందర్భంగా మోదీ సభలో ఉండాల్సిందేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రధాని సభలో ఉంటేనే చర్చ పై అవగాహన ఉంటుందని..అప్పుడే ఆయన ఏం చర్యలు తీసుకుంటారో తెలుస్తుందని ఖర్గే పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకుని సభలో లేనివారి పేర్లను ప్రస్తావించవద్దని, మోదీ గేట్ లాంటి పదాలను వాడరాదని సభ్యులకు సూచించారు. దాంతో సుష్మ స్వరాజ్ జోక్యం చేసుకుని 'మోదీ గేట్ అంటారా లేక లలిత్ గేట్ అంటారా అననివ్వండి...ముందు చర్చ జరగనివ్వండి' అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వాయిదా వేశారు. -
'మోదీ'పై చర్చకు సిద్ధం'
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ అంశంపై ఈ రోజు తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. రాజ్యసభలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ ... ఆ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 20 - 20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పాటు ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ ఆయన విదేశాలకు పరారైయ్యారు. దాంతో భారత్ ప్రభుత్వం ఆయనపై బ్లూ కార్నర్ నోటుసులు జారీ చేసింది. లండన్ ఉన్న లలిత్ మోదీ తన భార్యకు వైద్య చికిత్స నిమిత్తం పోర్చుగల్ వెళ్లాల్సి వచ్చింది. వీసా మంజూరు కోసం ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను సంప్రదించారు. ఆమె బ్రిటన్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి... లలిత్ మోదీ సమస్యను పరిష్కరించారు. ఆ విషయం బయటకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. బీజేపీపై ఎదురుదాడికి దిగింది. మోసానికి పాల్పడిన లలిత్ మోదీకి ఎలా సహాయం చేశారంటూ సుష్మా స్వరాజ్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. దాంతో తాను మానవత్వంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సుష్మా ప్రకటించారు. కానీ సుష్మా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఈడీకి మోదీ షాక్
ముంబై: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాకిచ్చాడు. గతవారం తాము జారీచేసిన సమన్లను మోదీ తిప్పిపంపారని ఈడీ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే అది నిజంకాదని, ఇప్పటివరకు తమకు ఎలాంటి సమన్లు అందలేదని మోదీ తరఫు న్యాయవాది మహమ్మద్ ఎం అబ్దీ చెప్పుకొచ్చారు. ఐపీఎల్లో దాదాపు రూ.1700 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ.. 2008లో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల విక్రయాలకు సంబంధించిన రూ. 425 కోట్ల చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడని ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే మూడువారాల్లోగా తన ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జరీచేసింది. కాగా, ఈ సమన్లు తీసుకునేందుకు తాను అర్హుడినికానంటూ మోదీ తరఫు న్యాయవాది సమన్లను తిప్పిపంపారని ఈడీ అధికారులు చెప్పారు. దీనిని కొట్టిపారేసిన అబ్దీ.. తనకు ఎలాంటి సమన్లు అందలేదని స్పష్టం చేశారు. 'ఈడీ అధికారుల తీరు మరీ విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం లలిత్ నివసిస్తోన్న లండన్ అడ్రస్ వారికి తెలుసు. నిబంధనల ప్రకారం సమన్లు ఎలా పంపుతారో వారికి తెలియదా' అని అబ్దీ వ్యాఖ్యానించారు. -
మరో వివాదంలో లలిత్ మోదీ
* రాష్ట్రపతి ప్రతిష్టను దెబ్బతీసేలా ట్వీట్లు * పోలీసులకు రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక వెబ్సైట్ ట్విటర్లో పోస్టింగ్‌లు చేశారని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై రాష్ర్టపతి భవన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ జూన్ 23, 25న ట్విటర్లో పోస్ట్ అయిన చిత్రాలను, ఇతర వివరాలను ఫిర్యాదు కాపీతో ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు పంపింది. రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్, వివేక్ నాగ్‌పాల్ అనే వ్యాపారవేత్త ఫొటోను లలిత్ ట్విటర్లో పెట్టారు. రాష్ట్రపతి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నాగ్‌పాల్ ఆయననుంచి లబ్ధిపొందారని ఆరోపించారు. గతంలో కొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాదారుల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు తనపై ప్రణబ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ విచారణకు ఆదేశించారని మరో ఆరోపణ చేశారు. ఈ వివాదం వల్ల అప్పట్లో శశిథరూర్ కేంద్రమంత్రి పదవినుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా, ఈ ఫిర్యాదును పోలీసు కమిషనర్ తదుపరి చర్యలకోసం ఆర్థికనేరాల విభాగానికి పంపించారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఐపీసీ కింద కేసు నమోదు చేయాలా లేక, ట్వీటర్లో ఆ పేజీని బ్లాక్ చేయించడానికి స్థానిక కోర్టును ఆశ్రయించాలా అన్న దానిపై పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. -
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'
లండన్: రోజుకో సంచనం రేపుతానన్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ అన్నట్టుగానే చేశారు. ఇప్పటివరకు రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా క్రికెటర్లకు కూడా బురద అంటించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రావోలు బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్విట్టర్ లో పలు అంశాలు వెల్లడించారు. బాబా దీవాన్ అనే బుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడమేకాకుండా పలు చోట్ల ఫ్లాట్లు కూడా కొనిచ్చాడని చెప్పారు. ఇదే విషయమై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్కు 2013 తాను రాసిన లేఖను మోదీ బహిర్గతం చేశారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు బెట్టింగ్, ఫిక్సింగ్ కు పాల్పడి అనర్హులుకాగా, మోదీ తాజా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
సుష్మా తప్పుకుంటున్నారా?
న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సుష్మా స్వరాజ్ మొగ్గు చూపారా..? వారం రోజుల క్రితమే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె సిద్ధపడ్డారా..? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. లలిత్ మోడీ వీసా వివాదం మీడియాలో రావడానికి ముందే సుష్మా స్వరాజ్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు సమాచారం. లలిత్ మోడీ ట్రావెలింగ్ డాక్యుమెంట్లకు సంబంధించిన వ్యవహారం మీడియాలో లీక్ కాకముందే అందుకు సంబంధించిన వివరాలను సుష్మా ప్రధాని మోదీకి తెలియచేసినట్లు తెలుస్తోంది. అంతకుముందే ఆమె రాజీనామాకు సిద్ధపడ్డారని, అయితే ఆర్ఎస్ఎస్ జోక్యంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. మోదీతో సుష్మా భేటీ తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ అత్యున్నతస్థాయి నేతల మధ్య భేటీ జరిగిందని, ఆ సమావేశంలోనే లలిత్ మోదీ వీసా వివాదంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాల తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు శివసేన కూడా సుష్మాకు మద్ధతుగా నిలిచిందని తెలుస్తోంది. ఇక లలిత్ మోడీ వీసా వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని సుష్మా ఇంటి వద్ద నిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెక్యూరిటీని పటిష్టం చేసిన అధికారులు అక్కడ నిఘాను కూడా పటిష్టం చేశారు. మరోవైపు సుష్మా-లలిత్ మోడీ వీసా వివాదంపై కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను ఉద్ధృతం చేసింది. ఇప్పటికే సుష్మా రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు తాజాగా బెంగళూరులో ఆందోళన చేపట్టారు. స్థానిక నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు... సుష్మా, లలిత్‌మోడీ, నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సుష్మా వెంటనే మంత్రి పదవికి రాజనామా చేయాలని డిమాండ్ చేశారు. -
పెను తుఫానులో కేంద్రం
కోట్ల రూపాయలు పోసి నిర్మిస్తున్న తమ సినిమాలకు జనాదరణ కరువవుతున్నదని ఈమధ్య చిత్ర నిర్మాతలు వాపోతున్నారు. నిజ జీవితంలోనే క్షణక్షణానికీ ఊహాతీతమైన, ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు సామాన్య పౌరులకు ఇక వినోదం కోసం, సస్పెన్స్ థ్రిల్లర్ల కోసం థియేటర్లకు పోవలసిన అవసరమేముంటుంది? ఇప్పుడు ఊహించని విధంగా రాజుకుని ఎన్డీయే సర్కారును చుట్టుముట్టిన ‘లలిత్ మోదీ’ వివాదం అన్ని విధాలా ఉత్కంఠభరితమైన సినిమాను పోలి ఉంది. అయిదేళ్లక్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కమిషనర్‌గా పనిచేసి ఎన్నో అభియోగాలు ఎదుర్కొని పరారైన లలిత్ మోదీకి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తన హోదాను దుర్వినియోగం చేసి సాయపడ్డారన్నది ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆరోపణల సారాంశం. లలిత్ మోదీపై వచ్చిన అభియోగాలు సాధారణమైనవి కాదు. ఆయన ఐపీఎల్లో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని, వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించాడని, క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను కట్టబెట్టాడని, తన సన్నిహితులతో కంపెనీలను స్థాపించి వాటికి అనుకూలంగా రిగ్గింగ్‌కు పాల్పడి బిడ్లు దక్కేలా చేశాడని ఆ ఆరోపణల సారాంశం. వాటిపై ఆదాయపు పన్ను శాఖ మొదలుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వరకూ వివిధ సంస్థలు దర్యాప్తు మొదలెట్టడం.. ఈ మొత్తం వ్యవహారం న్యాయస్థానంలో విచారణకు రావడం పర్యవసానంగా లలిత్ మోదీ దేశం విడిచివెళ్లిపోయాడు. ఆయన ప్రత్యర్థులు చెబుతున్నట్టు ఆయనపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీచేసిందా... లలిత్ న్యాయ వాదులు చెబుతున్నట్టు అదంతా అబద్ధమా అన్నది పక్కనబెడితే వందల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ వేరే దేశం పరారైన వ్యక్తికి కేంద్ర కేబినెట్లోని సీనియర్ మంత్రి ఒకరు అన్ని నిబంధనలనూ బేఖాతరు చేసి సాయపడటం ధర్మమా అన్నదే ప్రశ్న. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడి ఏడాది కాలమవుతున్నది. బీజేపీ స్వయంగా చెప్పుకోవడమే కాదు... దాదాపు అన్ని వర్గాల పౌరులూ దాన్ని ఒకే ఒక విషయంలో ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు. మిగిలిన అంశాల మాటెలా ఉన్నా అది ఈ పన్నెండు నెలలకాలంలోనూ అవినీతి రహిత పాలన అందించిందని మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపించడానికి సాహసించలేదు. అలాంటి ప్రభుత్వంపై ఉరుము లేని పిడుగులా ఇప్పుడు లలిత్ మోదీ వివాదం వచ్చిపడింది. ఈ వివాదం రేకెత్తడం మాటలా ఉంచి... దాని విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు గానీ, ఇస్తున్న సంజాయిషీలుగానీ అందరికీ మరింత దిగ్భ్రాంతికలిగిస్తున్నాయి. వివాదం వెల్లడయ్యాక ఇచ్చిన ట్వీట్లలో సుష్మా తనను తాను గట్టిగా సమర్థించుకున్నారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు పోర్చుగల్‌లో శస్త్ర చికిత్స జరిపించాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం తాను అక్కడికెళ్లి సంతకం చేయాల్సి ఉంటుందని లలిత్ మోదీ నిరుడు జూలైలో కోరడంవల్ల సాయం అందించానని ఆమె చెబుతున్నారు. ఆయన పాస్‌పోర్టును రద్దుచేశామని, ఆయనకు ఎలాంటి ప్రయాణ పత్రాలు జారీచేసినా అది ఇరుదేశాల సంబంధాలనూ దెబ్బతీస్తుందని 2010లో భారత ప్రభుత్వంనుంచి బ్రిటన్‌కు సందేశం వెళ్లింది. గత అయిదేళ్లలోనూ ఈ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. వివిధ సంస్థల దర్యాప్తునకు ఆయన ఏనాడూ సహకరించలేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించే ఆధారాలేవీ ఆయన అందించలేదు. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నందున వీటన్నిటినీ పక్కనబెట్టి చేయూతనందించాలని సుష్మా స్వరాజ్ భావిస్తే భావించవచ్చు. కానీ అందుకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. విదేశాలతో సంబంధాల విషయంలో ఒక ప్రొటోకాల్ ఉంటుంది. ఆయన దరఖాస్తును స్వీకరించమని బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌ను కోరవచ్చు. దాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపితే...కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆర్థిక శాఖ ఆ అంశాన్ని పరిశీలించి తమ వైఖరిని వెల్లడించాక అందుకు అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సూచనైనా చేయవచ్చు. ఈ ప్రక్రియ అంతా ప్రారంభించడానికి ముందు... భారత్‌కు తిరిగొచ్చి చట్టానికి సహకరిస్తానని, తనపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణకు తోడ్పడతానని ఆయననుంచి హామీ తీసుకుని ఉంటే సుష్మా ప్రదర్శించిన ‘మానవతా దృక్పథానికి’ అర్థం ఉండేది. అయితే, ఇదంతా చివరకు ఎటు దారితీస్తుందోనని జంకి... విమర్శలు ఎదుర్కొనవలసి వస్తుందని సందేహించి మొత్తం వ్యవహారాన్ని దాచడానికి ప్రయత్నించినట్టు కనబడుతోంది. సాధారణ పరిస్థితుల్లో అయితే సుష్మా స్వరాజ్ చర్య ఇంత వివాదాస్పదం కాకపోయేది. ఈ విషయంలో బ్రిటన్‌లో ఉండే భారత హైకమిషనర్ కార్యాలయాన్ని సుష్మా ఏ దశలోనూ సంప్రదించకపోవడమే ఉన్న అనుమానాలను మరింతగా పెంచింది. ఇందులో మరో కోణం ఉంది. సుష్మా సాయం అందజేసిన నెల్లాళ్లకు... అంటే నిరుడు ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఆదేశాలిచ్చింది. సాంకేతికంగా చూస్తే లలిత్‌కు సుష్మా స్వరాజ్ సాయపడిన సమయానికి ఆయన పాస్‌పోర్టు రద్దయి ఉంది కనుక లలిత్ భారతీయ పౌరుడు కారు. కనుక దానిద్వారా సమకూరే హక్కులు ఆయనకు లభించవు. అలాంటపుడు ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, సిఫార్సు చేయడం దోషమవుతుంది. మీదుమిక్కిలి సుష్మా కుమార్తె లలిత్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించి ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ అధికారాలను వినియోగించేటపుడు...మరీ ముఖ్యంగా వివాదాల్లో ఉన్నవారికి తోడ్పడేముందూ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. ఈ పెనుతుఫాను నుంచి ఎన్డీయే సర్కారు ఎలా బయటపడుతుందో వేచిచూడాలి. -
మోడీ.. మళ్ళీ తన సత్తా చాటుతాడా?
-
ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట
న్యూఢిల్లీ: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. స్వాధీనం చేసుకున్న మోడీ పాస్ పోర్టును ఆయనకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో లండన్‌లో ఉంటున్న మోడీ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో బీసీసీఐ మోడీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత నాలుగేళ్లుగా మోడీ లండన్‌లోనే ఉంటున్నారు. విచారణకు రావాలని ఈడీ ఆదేశించినా.. భారత్‌లో తనకు ప్రాణ హాని ఉందంటూ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.