
ఐపీలఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుష్మితతో తను ప్రేమలో ఉన్నట్లు లలిత్ మోదీ గత జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సుష్మితను తన జీవిత భాగస్వామిగా పేర్కొంటూ వారద్దరు వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేశాడు లలిత్ మోదీ. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబుతున్నారని అంతా అనుకున్నారు. దీంతో లేటు వయసులో ప్రేమ ఏంటని నెటిజన్లు వీరిని దారుణంగా ట్రోల్ చేయడంతో వీరి ప్రేమయాణంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
అయితా తాజాగా వీరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చట అయినట్లు తెలుస్తోంది. సుస్మితా, లలిత్ మోదీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టా బయోలో సుస్మితా పేరు తొలగించడమే. ఇది చూసి వీరిద్దరి విడిపోయారని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా గత జూలై 14న సుస్మితాతో తాను ప్రేమ ఉన్నట్లు ప్రకటించిన లలిత్ మోదీ.. తన ఇన్‌స్టాబయోలో సుస్మితని తన లైఫ్ పార్ట్‌నర్ పేర్కొన్నాడు. ఇన్‌స్టా బయోలో ‘ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫౌండర్ చివరికి తన లైఫ్ పార్ట్‌నర్‌ని కనుగొన్నాడు.
చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ
మై లవ్ సుష్మితా’(Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - finally starting a new life with my partner in crime. My love @sushmitasen47) అని రాశాడు. ఇర ఈ సోమవారం తన బయోలో సుస్మితా పేరు తొలగించి ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ (Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - Moon) అని మాత్రమే పెట్టాడు. అంతేకాదు సుష్మితాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా ప్రోఫైల్‌గా పెట్టుకున్న లలిత్ మోదీ ఆ ఫొటోని కూడా మర్చేయడం చర్చనీయాంశమైంది. ఇదంతా చూసి వారిద్దరు విడిపోయారా? అసలేం ఏం జరింగింది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్ రూమర్స్‌పై లలిత్ మోదీ, సస్మితాలు ఎలా స్పందిస్తారో చూడాలి.