Is Sushmita Sen Dating With These 9 Men Before Lalit Modi, Details Inside - Sakshi
Sakshi News home page

Sushmita Sen: లలిత్‌ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్‌, వారెవరంటే!

Published Sat, Jul 16 2022 9:12 AM | Last Updated on Mon, Sep 5 2022 1:42 PM

Is Sushmita Sen Dating With 9 Men Before Lalit Modi - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో సుష్మితా సేన్‌- లలిత్‌ మోదీలో ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారింది. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్‌ మోదీ సోషల్‌ మీడియా వేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు.. కానీ సడెన్‌గా వీరిమధ్య ప్రేమ ఏంటని అంతా షాక్‌ అవుతున్నారు. ఇక కొందరు నెటిజన్లు అయితే లేటు వయసులో ఈ ఘాటూ ప్రేమ ఏంటని ట్రోల్‌ చేస్తున్నారు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో సహాజీవనం, ఇప్పుడు ముసలోడితో ప్రేమ అంటూ సుష్మితాపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

చదవండి: బిగ్‌బాస్‌ క్రేజ్‌.. రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిన హీరో?

అంతేకాదు ఆమె గతంతో ఎవరెవరితో ప్రేమ వ్యవహారం సాగించిందో కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఆమె లలిత్‌ మోదీతో సహా 9 మందితో సహాజీవనం చేసినట్లు తెలుస్తోంది. ​కాగా ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్‌. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్‌ అయింది. అలా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులతో పాటు ఓ క్రికెటర్‌, నటులు, బడా వ్యాపారవేత్తలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో సుష్మితా పలువురు నటులు, క్రికెటర్‌, వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.

చదవండి: ‘దళపతి’ విజయ్‌ కేసును ముగించిన హైకోర్టు

అంతమందితో ప్రేమలో పడ్డ ఆమె కేవలం డేటింగ్‌ వరకు పరిమితమైంది. మొన్నటి దాక తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తోంది మూడేళ్లు సహాజీవనం చేసిన ఆమె గతంలో క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌, నటుడు రణ్‌దీప్‌ హుడా, డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌, ముద్దాసిర్‌, మానవ్‌ మీనన్‌లతో కొన్నేళ్ల పాలు సహాజీవనం చేసింది. ఇక బడా వ్యాపారవేత్తలైన రితిక్‌ ఖాసిన్‌, సబీర్‌, సంజయ్‌ నారంగ్‌, ఇంతియాజ్‌లతో కూడా గతంలో ఆమె డేటింగ్‌ చేసింది. కాగా ప్రస్తుతం సుష్మితా వయసు 46 కాగా.. లలిత్‌ మోదీ వయసు 56 ఏళ్లు. కాగా సుష్మితా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలను దత్తకు తీసుకుని తల్లైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement