Actress Sushmita Sen Reaction To Trolls Over Dating With Lalit Modi, Deets Inside - Sakshi
Sakshi News home page

Sushmita Sen Dating Trolls: గోల్డ్‌ డిగ్గర్‌ అంటూ కామెంట్స్‌.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి

Published Tue, Jul 19 2022 3:06 PM | Last Updated on Tue, Jul 19 2022 6:53 PM

Sushmita Sen Response On Trolls Over Dating With Lalit Modi - Sakshi

ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ డేటింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇటీవల సుష్మితాను తన భాగస్వామిగా పేర్కొంటూ లలిత్‌ మోదీ ఫొటోలు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిని త్రీవస్థాయిలో ట్రోల్‌ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమపై వస్తున్న ట్రోల్స్‌పై లలిత్‌ మోదీ స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చాడు. మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి’’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.

చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్‌?

‘గోల్డ్‌ డిగ్గర్‌’(డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి) అంటూ సుష్మితను సైతం ట్రోల్‌ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా సుష్మితా సేన్‌ స్పందించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘ప్రస్తుతం నా జీవితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేస్తున్నాననేది నా వ్యక్తిగతం. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. చూట్టు ఉన్న ప్రపంచం దయనీయకంగా మారుతోంది. అది చూస్తుంటే నాకు జాలేస్తోంది. నేను ఎప్పుడు కలవని, అసలు పరిచయమే లేని మిత్రులు, కొంతమంది మేధావులు నా జీవితంపై హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేనే ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు. నేను ఓ గోల్డ్‌ డిగ్గర్‌ అంటూ నాపై కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

కానీ నేను బంగారం కంటే డైమంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయితే వాటిని నేను సొంతంగా కొనుక్కోగలను కూడా. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నా. ఇక మీ అందరు ఒక విషయం తెలుసుకోండి. మీ సుష్‌ బాగానే ఉందని తెలుసుకోండి. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా నాకు సపోర్ట్‌గా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ సుష్మితా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కాగా లలిత్‌ మోదీతో సుష్మితా డేటింగ్‌ చేస్తున్న విషయం చెప్పినప్పటి నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బు కోసమే ఆయన సుష్మితా డేటింగ్‌ చేస్తుందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరూ ఆమె గత ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లో చర్చిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement