Sushmita Sen Spotted With Ex BF Rohman Shawl While Screening Of Laal Singh Chaddha - Sakshi
Sakshi News home page

Sushmita Sen: లలిత్‌ మోదీతో డేటింగ్‌.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్‌

Published Thu, Aug 11 2022 11:54 AM | Last Updated on Thu, Aug 11 2022 12:36 PM

Sushmita Sen Spotted at Laal Singh Chaddha Screening With Daughters, Ex BF Rohman Shawl - Sakshi

గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమెపై తరచూ ఏదోక వార్త నెట్టింట సందడి చేస్తోంది. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు ఇటీవల లలిత్‌ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి డేటింగ్‌పై సోషల్‌ మీడియా తీవ్ర చర్చ జరిగింది. అంతేకాదు నెటిజన్ల నుంచి వీరు ట్రోల్స్‌ కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుష్మితా తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది.

చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

నేడు(ఆగస్ట్‌ 11) ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ రిలీజ్‌ నేపథ్యంలో నిన్న నిర్వహించిన ప్రీమియర్‌ షోకు సుష్మితా తన పిల్లలు రినీ సేన్‌, అలిషా సేన్‌లతో కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌ కూడా కనిపించాడు. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహ్మాన్‌ సుస్మితా, ఆమె పిల్లలతో కలిసి చాలా సరదాగా కనిపించాడు. కాగా రోహ్మాన్‌తో బ్రేక్‌ప్‌ అనంతరం లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తున్న సుష్మితా మూవీ షోలో మాజీ ప్రియుడితో కనిపించడంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది.

చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు

కాగా రోహ్మాన్‌, సుష్మితాలు కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం గత డిసెంబర్‌లో బ్రేకప్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆగస్ట్‌ 8న సుష్మితా తల్లి బర్త్‌డే వేడుకులో కూడా రోహ్మాన్‌ దర్శనం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు కలిసి జరపుకున్న ఈ వేడుకకు సంబంధించి లైవ్‌ వీడియో షేర్‌ చేసింది సుష్మితా. ఇందులో రోహ్మాన్‌, సుష్మితా పిల్లలతో కలిసి మాట్లాడుతూ కనిపించాడు. అయితే అందరు కెమెరా సైడ్‌ చూడండి అని సుష్మితా అనగానే రోహ్మాన్‌ ఫ్రేం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇది చూసి నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి మీ ప్రస్తుత బాయ్‌ ఫ్రెండ్‌ లలిత్‌ మోదీ ఎక్కడ అంటూ సుస్మితాను ట్రోల్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement