మళ్లీ నటిస్తున్న సుస్మితాసేన్ | Sushmita Sen to join Aishwarya Rai-Bachchan in 'Happy Anniversary' | Sakshi
Sakshi News home page

మళ్లీ నటిస్తున్న సుస్మితాసేన్

Published Mon, Apr 14 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

మళ్లీ నటిస్తున్న సుస్మితాసేన్

మళ్లీ నటిస్తున్న సుస్మితాసేన్

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సుస్మితాసేన్ ఓ చిత్రంలో నటించబోతున్నారు. ‘నో ప్రాబ్లమ్’ తర్వాత ఆమె వేరే ఏ సినిమాలోనూ నటించ లేదు. ఈ ఏడాది నుంచి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బెంగాలీ సినిమాలో నటించడానికి అంగీకరించారు సుస్మిత. తొమ్మిదేళ్ల క్రితం ‘ఇట్ వాస్ రెయినింగ్ దట్ నైట్’ అనే బెంగాలీ సినిమాలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆమె ఆ భాషలో సినిమా అంగీకరించడానికి కారణం కథ బాగా నచ్చడమే. లేడీ డెరైక్టర్ రూపాలీ గుహ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రకథ నచ్చి, ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నారట సుస్మిత. అలాగే, ఈ చిత్రం రీమేక్ హక్కులను చేజిక్కించుకుని, హిందీలో నిర్మించాలనుకుంటున్నారట.
 
  ఒకవైపు బెంగాలీ సినిమాకి సన్నాహాలు చేసుకుంటూనే మరోవైపు ‘హ్యాపీ యానివర్శరీ’ అనే హిందీ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రహ్లాద్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించనున్నారట. ఒకప్పుడు ఐష్, సుష్‌ల మధ్య అంత సఖ్యత ఉండేది కాదనే వార్తలు వచ్చాయి. అయితే, అవేం మనసులో పెట్టుకోకుండా ఈ ఇద్దరూ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారట. సుస్మితా అయితే.. ‘ఐశ్వర్యాతో సినిమా చేయడానికి నేను రెడీ’ అని ఇటీవల ఓ సందర్భంలో బహిరంగంగా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement