
ముంబై : బాలీవుడ్‌లో నెపోటిజమ్‌పై చర్చ రోజురోజుకీ సెగలు రాజేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటి వరకు అనేక మంది బంధుప్రీతిపై తమ అభిప్రాయాన్ని వెలువరించగా.. తాజాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను నెపోటిజమ్ చర్చల్లోకి లాగారు. సుస్మితా సేన్‌కు ఇండస్ట్రీలో బంధువులు ఎవరూ లేరు. దీంతో ఓ నెటిజన్ ఆమెను..‘బాలీవుడ్‌లోని నెపోటిజమ్ నుంచి ఎలా బయటపడగలిగారు’. అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. (‘జింతాత జిత జిత జింతాత తా..’ గుర్తుందా!)
ఇక దీనిపై స్పందించిన సుస్మితా.. ‘నేను కేవలం నా అభిమానులపై ద`ష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యను దూరం పెట్టాను. మీరు నన్ను ఆదరించినంతకాలం నేను నటిగా నా సేవలు కొనసాగిస్తూనే ఉంటాను’. అంటూ సమాధానమిచ్చారు. కాగా ‘ఆర్య’ వెబ్ సిరీస్‌తో మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారు నటి సుస్మితా సేన్. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా.. రెండు సంవత్సరాల తర్వాత దస్తక్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. (బాధపడకండి.. నేను చనిపోవడం లేదు: నేహా)
Comments
Please login to add a commentAdd a comment