పందెం గెలిచాడు! | Sushmita Sen Boyfriend Rohman Shawl Wins Race For Her Daughter | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కూతురి కోసం పందెం గెలిచాడు!

Published Sat, Feb 2 2019 5:44 PM | Last Updated on Mon, Jun 10 2019 3:38 PM

Sushmita Sen Boyfriend Rohman Shawl Wins Race For Her Daughter - Sakshi

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవెంట్‌ ఏదైనా సరే అందరీ కళ్లూ తమపైనే ఉండాలి అన్నట్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. అయితే సుస్మితతో రిలేషన్‌షిప్‌ వరకే రోహమన్‌ పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారి మనసులు కూడా గెలుచుకున్నాడు. తాజాగా అలీషా స్కూళ్లో జరిగిన పరుగు పందెంలో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించిన రోహమన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్‌ ఏ మ్యాన్‌..!
రోహమన్‌ పరుగుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన సుస్మిత.. ‘ వాట్‌ ఏ మ్యాన్‌!!! అదీ రోహమన్‌ అంటే! అలీషా స్కూల్‌ ఫాదర్‌ రేసులో పాల్గొని స్వర్ణం సాధించాడు. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. రోహ్‌, అలీషాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లవ్‌ యూ గయ్స్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఇందుకు స్పందనగా ‘ రోహమన్‌ మీకు, మీ పిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతడిని జీవిత భాగస్వామిగా పొందితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు’ అని కొంతమంది రోహమన్‌ను పొగుడుతూ ఉంటే.. మరికొందరు మాత్రం.. ‘ చిన్న వయసులో తండ్రి అవడం వల్లే రోహమన్‌ గెలిచాడు. పాపం ఆ రేసులో ఉన్న తండ్రులు చాలా పెద్ద వయస్సు వాళ్లు. ఇది తొండాట’ అని సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అన్నట్లు చెప్పలేదు కదూ.. రోహమన్‌.. సుస్మితా సేన్‌ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement