Naga Chaitanya Said He Wants to Work With Alia Bhatt - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆమె అంటే క్రష్‌, ఆ స్టార్‌ హీరోయిన్‌తో నటించాలని ఉంది

Published Tue, Aug 16 2022 4:27 PM | Last Updated on Tue, Aug 16 2022 6:22 PM

Naga Chaitanya Said He Wants to Work With Alia Bhatt - Sakshi

అక్కినేను హీరో నాగ చైతన్య బాలీవుడ్‌ తొలి చిత్రం లాల్‌ సింగ్‌ చడ్డా ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంటున్న ఈ సినిమాలో చై పాత్రకు మాత్రం మంచి స్పందన వస్తోంది. బాలరాజుగా చై అద్భుతంగా నటించాడంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందు నుంచే చై వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడాకులు, మాజీ భార్య సమంత గురించి, తన వ్యక్తిగత విషయాలపై చై చేసే వ్యాఖ్యలు ఆసక్తికని సంతరించుకుంటున్నాయి.

చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్‌ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో అతడి కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన చైకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కాగా లాల్‌ సింగ్‌ చడ్డా మూవీతో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో అక్కడ హీరోగా చేస్తే ఏ హీరోయిన్స్‌తో కలిసి నటించాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ఆలియా భట్‌, కత్రీనా కైఫ్‌, ప్రియాంక చోప్రాల పేర్లు చెప్పాడు. అనంతరం ‘ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారందరితో కలిసి పని చేయాలని ఉంది. అందులో ముఖ్యంగా ఆలియా భట్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం.

చదవండి: ఆమిర్‌కు మద్దతు.. స్టార్‌ హీరోకు బాయ్‌కాట్‌ సెగ

ఐ లవ్‌ హర్‌ యాక్టింగ్‌. ఒకవేళ తనతో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను’ అంటూ మనసులో మాట చెప్పాడు. మనం సినిమా హిందీలో రీమేక్‌ అయితే తన పాత్ర ఎవరు చేస్తే బాటుందని అడగ్గా.. రణ్‌బీర్ అని సమాధానం ఇచ్చాడు. ఇక సెలబ్రెటీ క్రష్‌ ఎవరని అడగ్గా.. మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ అని బదులిచ్చాడు చై. కాగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు గడిచిన ఇప్పటికి ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద రూ. 37.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement