Sushmita Sen Reveals How She Dealt With 15 Year Old Boy Misbehaving with Her - Sakshi
Sakshi News home page

Sushmita Sen: సుష్మితను అభ్యంతరకరంగా టచ్‌ చేసిన పిల్లవాడు, నటి ఏం చేసిందంటే?

Published Sat, Nov 19 2022 4:44 PM | Last Updated on Sat, Nov 19 2022 6:23 PM

Sushmita Sen Reveals How She Dealt With 15 Year Old Boy Misbehaving with Her - Sakshi

మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌ నేడు 47వ పడిలోకి అడుగుపెట్టింది. ఎన్నో హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఎప్పుడు? ఎలా? మాట్లాడాలన్నది వెన్నతో పెట్టిన విద్య. ఓసారి ఓ అబ్బాయి తనతో అనుచితంగా ప్రవర్తించినప్పుడు సుష్మితా అతడిని దోషిగా నిలబెట్టకుండా తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. తప్పు చేశాడని దోషిగా నిలబెడితే అతడి భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆలోచించి తనకు రెండు మంచి మాటలు చెప్పింది.

ఇంతకీ ఆ సంఘటన ఏంటో ఆమె మాటల్లోనే.. 'ఒక ఈవెంట్‌లో నా చుట్టూ చాలామంది అబ్బాయిలు గుమిగూడి ఉన్నారు. ఒక చేయి పదేపదే నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే ఆ చెయ్యి పట్టుకుని ముందుకు లాగాను. తీరా పదిహేనేళ్ల పిల్లవాడు నా ముందుండటంతో షాకయ్యాను. అతడు చేసిన పనికి నేను ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు.

అందరి ముందు అతడికి హలో చెప్పి పక్కకు తీసుకెళ్లాను. ఇప్పుడే, ఈ క్షణమే అరిచి, ఏడ్చి గోల చేశాననుకో.. నీ జీవితమే నీకు లేకుండా పోతుంది. అది నీకు ఓకేనా అంటే అతడు వద్దని అడ్డంగా తలూపాడు. అంతేకాదు, ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించనని మాటిచ్చాడు. పిల్లలకు అలా ప్రవర్తించడం సరదా కాదని, పెద్ద తప్పని చెప్పాలి. అవి మనమే వారికి దగ్గరుండి నేర్పించాలి' అని చెప్పుకొచ్చింది. కాగా సుష్మితా చివరగా ఆర్య వెబ్‌సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆమె తాళిలో ట్రాన్స్‌ వుమెన్‌గా నటిస్తోంది.

చదవండి: ప్రియురాలి కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న హృతిక్‌ రోషన్‌
మహేశ్‌బాబు పాటకు కృతీసనన్‌ డ్యాన్స్‌, వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement