నేను మగాడిని అయి ఉంటే!: నటి | actress Sushmita Sen gives reply to twitter follower | Sakshi
Sakshi News home page

నేను మగాడిని అయి ఉంటే!: నటి

Published Wed, Mar 8 2017 5:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నేను మగాడిని అయి ఉంటే!: నటి - Sakshi

నేను మగాడిని అయి ఉంటే!: నటి

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ అభిమాని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా అజయ్ కేఆర్ శుక్లా అనే ఫాలోయర్ నటిని ఓ ప్రశ్న అడిగాడు. ఒకవేళ మీరు మగవారు అయితే మహిళలు, మహిళా సాధికారత కోసం ఎలాంటి పనులు చేస్తారు, మీ ఆలోచన విధానం ఎలా ఉండేదని సుస్మితాను సమాధానం అడుగుతూ ట్వీట్ చేశాడు.  అభిమాని ట్వీట్ కు కొన్ని నిమిషాల్లోనే సుస్మితాసేన్ బదులిచ్చారు. మొదటగా ఆ ప్రశ్న అడిగినందుకు మెచ్చుకున్నారు.

'ఒకవేళ తాను పురుషుడు అయితే మాత్రం కచ్చితంగా ఆడవాళ్ల సాధికారత కోసం పోరాటం చేయనని.. మగవారితో పాటు మహిళలు కూడా సమానమేనని గుర్తుంచుకుంటాను. అదేవిధంగా ఆడవారికి సమాన అవకాశాలు ఉండాలని భావిస్తానని' నటి సుస్మితాసేన్ మరో ట్వీట్ లో ఇలా తన అభిప్రాయాన్ని అజయ్ కేఆర్ శుక్లా అనే ఫాలోయర్ తో షేర్ చేసుకున్నారు. ఇటీవల తన పెళ్లి ప్రస్తావనపై వచ్చే అంశాలపై మాట్లాడుతూ.. నిప్పుతో చెలగాటం ఆడే మగాడు తనకు కనిపించలేదని అందుకే తాను సింగిల్ గా ఉంటున్నానని చమత్కరించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement