శ్రీదేవి బర్త్ డే పార్టీలో తారల హడావిడి!
శ్రీదేవి బర్త్ డే పార్టీలో తారల హడావిడి!
Published Sun, Aug 18 2013 3:02 PM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
బాలీవుడ్ అందాల తార శ్రీదేవి 50 జన్మదినాన్ని పురస్కరించుకుని భర్త బోని కపూర్ ఇచ్చిన విందు బాలీవుడ్ తారలతో కళకళలాడింది. బోని కపూర్ ఏర్పాటు చేసిన విందుకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, తారలు తరలివచ్చారు. సద్మా, హిమ్మత్ వాలా, చాల్ బాజ్, జుదాయి, మిస్టర్ ఇండియాలాంటి హిట్ లతో అగ్రతార వెలుగొంది.. కొంత కాలం బాలీవుడ్ కు దూరమైన శ్రీదేవి తాజాగా ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.
విందుకు హాజరైన వారిలో బాలీవుడ్ తారలు శిల్పా శెట్టి, సుస్మితా సేన్, హేమా మాలిని, ఇషా డియోల్, జూహీ చావ్లాలతోపాటు దర్శకులు అబ్బాస్ మస్తాన్, బంటీవాలియా, రమేశ్ తరానీ, గిరిష్ తరానీ, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ సంతోషి, జయ్ మెహతా, రిషి కపూర్, మనోజ్ బాజ్ పేయ్, వినోద్ ఖన్నా, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ లు సంగీత దర్శకులు అను మాలిక్, బప్పిల హరి లుహాజరయ్యారు.
Advertisement
Advertisement