కోన వెంకట్ కథకు ఓకే!
కోన వెంకట్ కథకు ఓకే!
Published Wed, Sep 18 2013 1:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
చాలా విరామం తర్వాత శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ ఘన విజయం సాధించి, ఆమెకు ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత మళ్లీ చాలామంది దర్శక నిర్మాతలు శ్రీదేవితో సినిమా చేయాలని అభిలషిస్తున్నారు.
ఇందుకోసం ఆమెకు చాలా కథలు వినిపించారు. అయితే ఏ కథా ఆమెను ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా మన తెలుగు రచయిత కోన వెంకట్ చెప్పిన కథ ఆమెను బాగా ఇంప్రెస్ చేసిందట. వెంటనే ఆ కథతో సినిమా చేయడానికి పచ్చజెండా కూడా ఉపేశారామె.
మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్ సన్నాహాలు మొదలుపెట్టారట. ఈ విషయాన్ని కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దర్శకుడు, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Advertisement
Advertisement