సుస్మిత.. రోష్మిత | The judge in the Miss Universe Sushmita Sen in jeopardy | Sakshi
Sakshi News home page

సుస్మిత.. రోష్మిత

Published Tue, Jan 24 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

సుస్మిత.. రోష్మిత

సుస్మిత.. రోష్మిత

మిస్‌ యూనివర్స్‌
పేర్లు కలిశాయి.. ‘టైటిల్‌’ కూడా కలిసొస్తుందా?


విశ్వసుందరిగా ఎంపికైన వేదిక నుంచే ‘విశ్వసుందరి’ పోటీలకు న్యాయనిర్ణేతగా వెళ్లడం అపురూపమైన సంగతే! ‘అయితే ఇది అపురూపం మాత్రమే కాదు. పరిపూర్ణం కూడా. నా లైఫ్‌ ఇప్పుడు ఫుల్‌ సర్కిల్‌ తిరిగినట్లుగా ఉంది’ అంటున్నారు మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌. 1994లో ఫిలిప్పీన్‌లో మనీలాలో జరిగిన అందాల పోటీలలో సుస్మిత ‘విశ్వ సుందరి’గా ఎన్నికయ్యారు. 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోతున్న మిస్‌ యూనివర్స్‌ పోటీలకు జడ్జీలలో ఒకరిగా హాజరవుతున్నారు! 

ఆ ఈవెంటుకు సుస్మిత.. డాన్సింగ్‌ హార్ట్‌తో సిద్ధం అవుతున్నారట. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, తన కూతురు అలీషా సేన్‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు సుస్మిత. ఈ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ కోసం మనదేశం నుండి పోటీపడుతున్న రోష్మిత హరిమూర్తి.. ఆ రోజున భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. లక్కీగా రోష్మితకు గానీ టైటిల్‌ వచ్చిందా... మళ్లీ అదో రికార్డ్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement