పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా | My mom keeps telling me to get married: Randeep Hooda | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా

Published Tue, Sep 10 2013 3:11 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా

పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా

బాలీవుడ్ లో సుస్మితా సేన్, నీతూ చంద్రల డేటింగ్ తో  కాలం గడిపిన బాలీవుడ్ హీరో రణదీప్ హుడా కు ఈ మధ్య ఇంటిపోరు ఎక్కువైంది. ప్రస్తుతం ఒంటరిగా కాలం గడుపుతూ.. కెరీర్ పైనే కన్నేసిన రణదీప్ ను ఓ ఇంటివాడైతే చూడాలని తల్లి కోరుకునేదటా! అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ అవకాశాలు పెరగడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న తన తల్లి ప్రస్తుతం పెళ్లి విషయం ఎత్తడం లేదని రణదీప్ తెలిపాడు.

తన కుటుంబమే తనకు అతిపెద్ద విమర్శకులని.. తన కుటుంబానికి ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. తనకు పూర్తి సహకారాన్నిఅందిస్తున్నారని రణదీప్ మీడియాతో అన్నాడు. మాన్సూన్ వెడ్డింతో కెరీర్ ప్రారంభించిన రణదీప్ హుడా డర్నా జరూరీ హై, రిస్క్, రంగ్ రసియా, లవ్ కిచిడి,జన్నత్ 2, మర్డర్ 3 చిత్రాల్లో నటించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement