Sushmita Sen Attends A Marriage Reception With Ex Boyfriend Rohman Shawl - Sakshi
Sakshi News home page

Sushmita Sen: మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం

Published Mon, Oct 24 2022 9:25 AM | Last Updated on Mon, Oct 24 2022 11:16 AM

Sushmita Sen Attends A Marriage Reception With Ex Boyfriend Rohman Shawl - Sakshi

మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నటిగా కంటే కూడా బాయ్‌ఫ్రెండ్స్‌ వ్యవహరంలోనే ఆమె సోషల్‌ మీడియాల్లో చర్చనీయాంశం అవుతోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన రొహ్మాన్‌ షాల్‌తో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం గతేడాది బ్రేకప్‌ చెప్పినట్లు ఆమె సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీతో ప్రేమలో పడినట్లు రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. అంతేకాదు వారిద్దరు కలిసి మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన ఫొటోలను లలిత్‌ మోదీ షేర్‌ చేస్తూ.. లైఫ్‌ పార్ట్‌నర్‌ అని పేర్కొన్నాడు. దీంతో మోదీతో సుస్మితా డేటింగ్‌ అంటూ ఆమె వార్తలోకెక్కింది. 

చదవండి: న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం

ఇదిలా ఉంటే వీరి ప్రేమ మున్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. లలిత్‌కు సుస్మితా బ్రేకప్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మాజీ ప్రియుడు రొహ్మన్‌తో కలిసి సుస్మితా తరచూ దర్శనమిస్తోంది. ఫ్యామిలీ ఫంక్షన్స్‌, ఈవెంట్స్‌తో పాటు ముంబై రోడ్లపై తరుచూ వీరిద్దరు కెమెరాకు చిక్కుతున్నారు. తాజాగా మరోసారి  జంటగా దర్శనమిచ్చారు. ఇటీవల జరిగిన ఓ ప్రముఖ డాక్టర్ల కుమార్తె పెళ్లి వేడుకలో సుష్మితా, రోహ్మన్‌లు హజరయ్యారు. వీరితో పాటు సుష్మితా దత్తత కుమార్తెలు రెనీ, అలీషా కూడా ఉన్నారు. రిసెప్షన్‌కు హాజరై కొత్త జంటతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అది చూసి నెటిజన్లు సుష్మితాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకప్‌ అనంతరం కూడా వీరిద్దరు కలిసే ఉంటున్నారా? ఇంతకీ సుస్మితా, రోహ్మాన్‌కు బ్రేకప్‌ చెప్పిందా? లేదా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement