మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ ఏదైనా సరే అందరీ కళ్లూ తమపైనే ఉండాలి అన్నట్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. అయితే సుస్మితతో రిలేషన్‌షిప్ వరకే రోహమన్ పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారి మనసులు కూడా గెలుచుకున్నాడు. తాజాగా అలీషా స్కూళ్లో జరిగిన పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన రోహమన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.