
రోహమన్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో సుస్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారని బీ-టౌన్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు ప్రచారమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ బలం చేకూరుస్తూ ఇటీవలే రోహమన్‌తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు ఈ బ్యూటీ. అంతేకాకుండా అతడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం.. ‘మై లవ్ ఆఫ్ లైఫ్’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా.
తాజాగా... తన కూతురు రీనీతో కలిసి రోహమన్ సంగీత సాధన చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మిత.. ‘రీనీ తన గురువు సారథ్యంలో సంగీతం నేర్చుకుంటోంది. ఆమెకు తోడుగా రోహమన్ షాల్ కూడా ఉన్నాడు. నా కూతుళ్లకు సంబంధించిన సంతోషకర సమయాల్లో తనెప్పుడూ భాగమవుతూ ఉంటాడు. లవ్ యూ గయ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
కాగా కొన్నాళ్ల క్రితం రితిక్ భాసిన్(నైట్ క్లబ్ యజమాని)తో బ్రేకప్ చేసుకున్న సుస్మిత ప్రస్తుతం రోహమన్‌తో డేటింగ్‌లో ఉన్నారట. తనతో పాటు రీనా, అలీషా(సుస్మిత దత్త పుత్రికలు)లకు కూడా రోహమన్ దగ్గరయ్యాడని, వారికి కూడా సమయం కేటాయించి సుస్మిత మనసు గెలుచుకున్నాడని బీ- టౌన్ కోడై కూస్తుంది. సుస్మితా సేన్ సోషల్ మీడియా అప్‌డేట్స్ చూస్తుంటే రోహమన్‌తో తన రిలేషన్ కన్‌ఫార్మ్ చేసినట్టే ఉన్నారంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పదిసార్లు ప్రేమలో పడిన ఆమె ఈసారైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు.. రోహమన్.. సుస్మితా సేన్ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు.
Comments
Please login to add a commentAdd a comment