renee
-
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్, మాజీ ప్రియుడు రోహ్మన్తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్‌సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: టాలీవుడ్లో విషాదం, సీనియర్ హీరో కన్నుమూత విజయ్‌కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు -
పేగు తెంచుకుని కాదు.. హృదయం నుంచి...
కేవలం అందంతో కాకుండా తనకున్న సేవాగుణంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. అందాల రాణిగా కిరీటం దక్కించుకున్న తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. హిందీతో పాటు పలు బెంగాలీ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. వెండితెరపై వెలుగులీనిన ఈ అమ్మడు మనసు వెన్న వంటిదని ఆమె స్నేహితులు చెబుతూ ఉంటారు. చారిటీ కోసం నిర్వహించే ఫ్యాషన్ షోల్లో పాల్గొనడమే కాకుండా ఆపదలో ఆదుకునే గుణం ఆమె సొంతం. అయితే అన్నింటి కంటే కూడా 2000లో సుస్మిత చేసిన పని స్నేహితులతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందనుకున్న తరుణంలో రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. ఆ తర్వాత పదేళ్లకు రీనికి తోడుగా అలీషా అనే చెల్లెల్ని బహుమానంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కూతుళ్లతో ఉన్న అనుబంధం గురించి సుస్మితా సేన్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. వాళ్లు తన కన్న కూతుళ్లు కాదనే విషయం రీనీ, అలీషాలకు తెలుసునని.. బంధం బీటలు వారకూడదనే ఉద్దేశంతోనే దత్తత గురించి చెప్పానని పేర్కొన్నారు. ‘ నా కూతుళ్లకు 18 ఏళ్లు వచ్చే నాటికి వారి కన్న తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాలని అనుకున్నాను. అయితే రీనీ చిన్నతనంలోనే తనను దత్తత తీసుకున్నానే విషయం చెప్పాను. ఆరోజు తను నా ఎదురుగా కూర్చుంది. కొంతమందికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఒకరు కన్నవారైతే మరొకరు పెంచిన వారు అని చెప్పాను. అయితే తానెవరినని రీనీ అడిగింది. నిన్ను దత్తత తీసుకున్నాను అని చెప్పాను. అప్పుడు తన ముఖంలో అభావాన్ని గమనించాను. అప్పుడు.. ‘నువ్వు నా పేగు తెంచుకుని కాదు. నా హృదయం నుంచి పుట్టావు. బయోలాజికల్ పేరెంట్స్ అంటే బోరింగ్. నువ్వు చాలా స్పెషల్ అని చెప్పాను. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో తను అలాగే చెప్పేది. అయితే ఓరోజు కోర్టుకు వెళ్లి తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకోమని, ఇది తన హక్కు అని రీనికి చెప్పాను. కానీ తను వెళ్లనంది. తన తల్లికి క్షణంపాటు దూరం చేసే ఏ హక్కు అయినా తనకు అక్కర్లేదని చెప్పింది’ అని ఈ మాజీ మిస్ యూనివర్స్ కూతురితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. -
సుస్మితా సేన్ కన్ఫామ్ చేసేశారా!?
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారని బీ-టౌన్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు ప్రచారమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ బలం చేకూరుస్తూ ఇటీవలే రోహమన్తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు ఈ బ్యూటీ. అంతేకాకుండా అతడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం.. ‘మై లవ్ ఆఫ్ లైఫ్’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. తాజాగా... తన కూతురు రీనీతో కలిసి రోహమన్ సంగీత సాధన చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మిత.. ‘రీనీ తన గురువు సారథ్యంలో సంగీతం నేర్చుకుంటోంది. ఆమెకు తోడుగా రోహమన్ షాల్ కూడా ఉన్నాడు. నా కూతుళ్లకు సంబంధించిన సంతోషకర సమయాల్లో తనెప్పుడూ భాగమవుతూ ఉంటాడు. లవ్ యూ గయ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. కాగా కొన్నాళ్ల క్రితం రితిక్ భాసిన్(నైట్ క్లబ్ యజమాని)తో బ్రేకప్ చేసుకున్న సుస్మిత ప్రస్తుతం రోహమన్తో డేటింగ్లో ఉన్నారట. తనతో పాటు రీనా, అలీషా(సుస్మిత దత్త పుత్రికలు)లకు కూడా రోహమన్ దగ్గరయ్యాడని, వారికి కూడా సమయం కేటాయించి సుస్మిత మనసు గెలుచుకున్నాడని బీ- టౌన్ కోడై కూస్తుంది. సుస్మితా సేన్ సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తుంటే రోహమన్తో తన రిలేషన్ కన్ఫార్మ్ చేసినట్టే ఉన్నారంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పదిసార్లు ప్రేమలో పడిన ఆమె ఈసారైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు.. రోహమన్.. సుస్మితా సేన్ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు. View this post on Instagram “Music is a #vibration of happiness”❤️💃🏻😀To witness Renee & her #Guruji do their #riyaz is just magical!!👏😊❤️ And Guruji on his part, makes sure EVERYONE sings😄🙏 So, @rohmanshawl (who already sings beautifully ❤️) & yours truly also share in the happiness!!! 😍💃🏻🎵 Alisah decided to be incharge of #applause 😅❤️ proud of you Renee Shona, May you always have a #song in your heart, with the courage to sing it!!👏😍👍#sharing #happiness #music #feeling #bliss 💋I love you guys!!!😀😘 A post shared by Sushmita Sen (@sushmitasen47) on Oct 28, 2018 at 11:01am PDT -
నలుపేంటి?! తెలుపేంటి?!
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. వేదిక మీదకు చక్కగా అలంకరించుకున్నచిన్నారి ఏంజిల్స్ ఒక్కొక్కరే వస్తున్నారు. చప్పట్ల మోతలో వెలుగుతున్న ముఖాలతో ముందుకు కదులుతున్నారు. వారిలో ఒకమ్మాయి రీనీ. ఫెయిరీ డ్రెస్‌లో ఉంది రీనీ. అందమైన డ్రెస్‌లో, వీపుకు రెక్కలు కట్టుకుని నడుస్తోంది. స్నిగ్ధత్వంతో కూడా ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో. గుంపులో నుంచి ఓ గొంతు... ‘నల్లటి ఫెయిరీని చూడండి’! ఆ మాటకంటే, ఆ మాట తర్వాత వినిపించిన నవ్వులే ఆమెను విపరీతంగా గాయపరిచాయి. కన్నీళ్లతో వేదిక దిగింది మూడేళ్ల రీనీ. మనదేశంలో తెల్లదనం మీదున్న విపరీతమైన వ్యామోహానికి పరాకాష్ట ఈ సంఘటన! ఆ రోజు... ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌తో ఎదురైన చేదు అనుభవంతో అక్కడే ఆగిపోయి ఉంటే... ఈ రోజు రీనీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు! అయితే రీనీ ఆగిపోలేదు. ఈ రోజు ప్రముఖ మోడల్. ఇటీవలే మొదలైన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రెండువేలకు పైగా ఫాలోవర్లున్నారు. గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావడానికి ఒంటి రంగు కారణంగా ఎన్ని రకాలుగా వివక్షకు లోనయిందో పూసగుచ్చినట్లు చెప్తోందామె రీనీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో.చత్తీస్‌ఘర్‌లోని బగీచా గ్రామానికి చెందిన అమ్మాయి రీనీ కంజూర్. నలుపును తెలుపు చెయ్యడం గొప్పా!! మోడలింగ్ మీద రీనీ పెంచుకున్న అభిరుచిని చంపేయడానికి అడుగడుగునా ఒకరుండేవాళ్లు. ‘ఈ రంగం గురించి నీకు తెలియదు, ఇందులో రాణించాలంటే క్లయింట్స్ సంతృప్తి చెందాలి. నీ స్కిన్ కలర్ చూస్తే దగ్గరకు రానివ్వరు. మిగిలిన మోడల్స్ చూడు ఎలా ఉన్నారో’.. ఇలా మాటలు ఆమెను శరాఘాతంలా తాకాయి. ఒక ఫొటోగ్రాఫర్ అయితే... ‘ఆమెకు మూడు–నాలుగు టచప్లిచ్చి కొంచెం తెల్లగా కనిపించేట్టు చేయి’ అని రీనీకి తెలియకుండా మేకప్మన్కి చెప్పాడు. ఆ మేకప్‌మన్ కూడా ఫొటోగ్రాఫర్కంటే తక్కువ వాడేమీ కాదు. ‘నల్లగా ఉన్న అమ్మాయిని అందంగా చూపించడం పెద్ద చాలెంజ్, నా మేకప్ నైపుణ్యంతో ఆ పని చేయగలిగాను’ అన్నాడు. అది తెలిసి రీనీ బాధపడింది. ఇదిలా ఉంటే... తీసిన ఫొటోలను ఫొటోషాప్‌లో తెల్లగా చేసే ప్రయత్నం జరిగేది. ‘నన్ను నన్నులా ఉండనివ్వండి. నా ఒంటి రంగు ఉన్నదున్నట్లు్ల కనిపించమే నాకిష్టం, లేని తెల్లదనాన్ని అద్దవద్దు’ అని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ వినేవారు కాదు. రిహాన్నాతో పోలిక ఓ మలుపు మోడలింగ్‌లో రీనీకి ఎదురవుతున్న విమర్శలు, కామెంట్లతో పోరాడుతూనే ఆ రంగంలో కొనసాగుతున్న రీనీకి ఓ రోజు ఆమె ఫ్రెండ్స్ చెప్పిన మాట ఎక్కడ లేని ఉత్సాహాన్నిచ్చింది. ‘బార్బేడియన్ సింగర్ రిహాన్నా కూడా నీలాగే ఉంటుంది’ అని స్నేహితులు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది.రిహాన్నా గాయని మాత్రమే కాదు, పాటల రచయిత్రి, నటి, బిజినెస్ ఉమన్ కూడా. ఆ తర్వాత.. మేకప్ లేకుండా, ఫొటోగ్రఫీ మెళకువలతో తెల్లగా చేయకుండా యథాతథంగా రీనీని ఫొటోలు తీశారు స్నేహితులు. రీనీ, రిహాన్నా ఫొటోలను పక్క పక్కన పెట్టి ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో రీనీకి విపరీతమైన గుర్తింపు వచ్చింది. కలువలతో పోల్చడం తప్పు దేహఛాయ దేనికీ ప్రామాణికం కాదు, అందానికి అసలే కాదు. అసలైన అందం ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది. అందుకు నిదర్శనమే రీనీ, రిహాన్నా. నల్లగా ఉన్న అందమైన అమ్మాయిని ‘నల్ల కలువ’తో పోలుస్తారు. ఆ పోలిక మరింత అగౌరవపరచడమే. కలువ ఏ రంగులో ఉన్నా కలువే. కలువకు రంగును ఆపాదించకుండా... నల్లగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ... చర్మాన్ని తెల్లబరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను నిరభ్యంతరంగా పక్కన పెట్టేయాలి. ఆ డబ్బుని, సమయాన్ని తమను తాము వ్యక్తిగా నిలబెట్టుకోవడానికి చేస్తే పరిపూర్ణత్వం వస్తుంది. అదే అసలైన అందం. రిహాన్నాను కలవడమే నా కల ఒకప్పుడు మోడలింగ్‌కి పనికిరావన్న ఫొటోగ్రాఫర్లే ఇప్పుడు క్లయింట్లతో ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ గురించి చెప్తున్నారు. పాప్ స్టార్ రిహాన్నా అందగత్తె కాదని ఎవరూ అనలేరు, కాబట్టి రీనీని కూడా అందగత్తె కాదనే సాహసం చేయడంలేదెవ్వరూ ఇప్పుడు. ‘నలుపులో అందం ఉండదనే అభిప్రాయాలను మార్చుకోండి, ఇప్పటి వరకు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోండి’ అంటోంది రీనీ. రీనీ స్ఫూర్తితో ఇప్పుడు మోడలింగ్‌లోని సాంకేతిక నిపుణులు ఇప్పుడు వాళ్ల రూల్స్‌ని మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ‘తెల్లటి దేహ ఛాయలోనే అందం ఇమిడి ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటున్నారు. ‘‘కొత్త నియమావళి రూపొందుతోందంటే మార్పు మొదలైనట్లే. ఒక మార్పుకు నేను కారణమైనందుకు సంతోషంగా ఉంది. దీనికంతంటకీ కారణమైన రిహాన్నాను కలవడమే ఇప్పుడు నా ముందున్న కల’ అంటోంది రీనీ. – మంజీర -
బాలీవుడ్ బ్యూటి సాహసాలు
తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటి సుస్మితా సేన్. కొంత కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద డైనమిక్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ఈ విశ్వ సుందరి, రియల్ లైఫ్‌లోనూ తాను సాహసినే అంటూ ప్రూవ్ చేసుకుంది. తన కూతుళ్లు రినీ, అలీషాలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా పులితో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సుస్మిత మాత్రమే కాదు తన కూతుళ్లు కూడా ఆ పులితో ఫోటోలు దిగటం విశేషం. ప్రస్తుతం హ్యాపి యానివర్సరీతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సుస్మితా సేన్, ఎక్కువ సమయం తన పిల్లలతో గడిపేందుకు వరుసగా సినిమాలు అంగీకరించటం లేదంది. Big one on my #bucketlist #tick