ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా : నటి | Sushmita Sen Tweet Children Dance Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా : నటి

Published Thu, Dec 3 2020 9:03 PM | Last Updated on Fri, Dec 4 2020 5:56 AM

Sushmita Sen Tweet Children Dance Video Goes Viral - Sakshi

టాలెంట్ అనేది ఎవడి అబ్బ సొత్తు కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ధనిక, పేద, చిన్నా, పెద్ద, కుల, మత భేదాలు ఉండవు. టాలెంట్ విషయంలో మనం ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇక సోషల్‌ మీడియా పుణ్యమా అని  చాలా మంది తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించుకుంటున్నారు. చాలా మంది ప్రముఖులు టాలెంట్‌ ఉన్నవాళ్లని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

తాజాగా నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా అలాంటి వీడియోని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దాంట్లో ఓ ముగ్గురు నిరుపేద పిల్లలు ప్రొఫిషినల్‌ డాన్సర్ల మాదిరి చిందులేశారు. కొంత మంది హీరోలు సైతం వేయలేని స్టెప్పులేశారు. పాటకు తగ్గ స్టెప్పులేస్తూ ఔరా అనిపించారు. ఈ వీడియోను సుష్మిత ట్వీట్‌ చేస్తూ ‘వారి నవ్వును ఒకసారి చూడండి. కల్మషం లేని నవ్వు వారిది,పరిపూర్ణమైన ఆనందం వారిది. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా. ఐ లవ్‌యూ గాయ్స్‌’అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ బుడుతల స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement