
సుస్మితాసేన్
ముంబై: ఒక నేరస్తుడిగా ఉండటానికి, ఒక మనిషిగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉందని నటి సుస్మితాసేన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దానిని పరిశీలించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు అయిదేళ్ల జైలు శిక్ష పడిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు ట్విట్ చేశారు.
''సల్మాన్ పైకోర్టుకు వెళ్లాలి. సల్మాన్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. సల్మాన్‌కు, ఆయన కుటుంబానికి మానసిక స్థైర్యం కలగాలని కోరుకుంటున్నాను'' అని సుస్మితా సేన్ ట్విట్ చేశారు. సల్మాన్ ఖాన్తో కలిసి సుస్మిత పలు చిత్రాలలో నటించారు.