ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు | Former Miss Universe Sushmita Sen Celebrated 44th Birthday | Sakshi
Sakshi News home page

ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు

Published Wed, Nov 20 2019 2:04 PM | Last Updated on Wed, Nov 20 2019 3:16 PM

Former Miss Universe Sushmita Sen Celebrated 44th Birthday - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరీ సుస్మితాసేన్‌ తన 44వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకొన్నారు. ఆమె వర్కవుట్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో పంచుకుంటూ తన దినచర‍్యను ప్రారంభించారు. దీంతో ఆమె అభిమానులు వయసు మీద పడుతున్నా... రోజురోజుకూ మరింత యవ్వనంగా కనిపించడానికి అసలు రహస్యం ఇదే కాబోలు అంటూ అభినందనల వర్షం కురిపించారు. ఆ తర్వాత మరో పోస్ట్‌ చేసిన సుస్మితా.. చిరకాలం గుర్తుండిపోయేలా తన పుట్టినరోజును ఇంటి టెర్రస్‌పై ప్లాన్‌ చేసిన బాయ్‌ఫ్రెండ్‌ రోహమన్‌ షాల్‌, కూతుళ్లు అలీసా, రెనీలకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజును ఇలా అందంగా అలంకరించిన టెర్రస్‌పై బెలూన్‌లు, లైట్ల మధ్య జరుపుకుంటానని అస్సలు ఊహించలేదన్నారు. బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ ఆనందం వ్యక్తం చేశారు. 

What a magical #birthday EVERYTHING I COULD’VE WISHED FOR & MORE❤️❤️❤️😁💃🏻🌈 Thank you jaan @rohmanshawl for this ALL HEART Birthday Surprise!!! I love you😍💋Everyone acted sooooo well...I really had no idea!!!😅👏 And there it was...a magical terrace with lights, balloons, tent, yummy cake & heartfelt notes suspended all over...How simply loved you make me feel Alisah, Renée, @rohmanshawl @pritam_shikhare @nupur_shikhare & Rajesh!!!🤗❤️😊Even my other baby, My puddle called #darling came to surprise me!!!😀😇🤗 #sharing #cherished #happiness #love #family #friends #celebrations #44yrs #birthdaygirl 😄💃🏻❤️🎵 I love you guys!! #duggadugga 💃🏻💃🏻💃🏻

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ఇక బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్(27)‌.. ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని సుస్మితాకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. 'సూర్యుడు ఎలాగైతే వెలుగును పంచుతాడో.. అలానే నువ్వు కూడా నా జీవితంలో వెలుగులు పూయిస్తావని ఆశిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ ప్రత్యేకమైన రోజున నీ గురించి పుంఖాను పుంఖాలు రాయాలని ఉంది. ఓ నా అందమైన ప్రియురాలా..! దేవుణ్ని ఇంకేం కోరుకోవాలి. మొత్తం ప్రపంచాన్నే నాకు ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే జాన్‌' అంటూ విష్‌ చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement