సుస్మితా సేన్కు మదర్ థెరిసా అవార్డు | Sushmita Sen gets Mother Teresa International Award | Sakshi
Sakshi News home page

సుస్మితా సేన్కు మదర్ థెరిసా అవార్డు

Published Mon, Oct 28 2013 4:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సుస్మితా సేన్కు మదర్ థెరిసా అవార్డు - Sakshi

సుస్మితా సేన్కు మదర్ థెరిసా అవార్డు

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్కు అరుదైన గౌరవం దక్కింది. సుస్మిత చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఓ స్వచ్ఛంద సంస్థ మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమెకు బహూకరించింది. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందజేశారు.

సుస్మిత ఈ విషయాన్ని సోమవారం ఉదయం ట్విట్టర్లో పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. సుస్మిత పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. 37 ఏళ్ల సుస్మిత బీవీ నెంబర్వన్, మైన్ హూ నా వంటి హిందీ సినిమాల్లో మెప్పించారు. టాలీవుడ్లోనూ ఆమె నటించారు. 'రక్షకుడు' సినిమాలో నాగార్జున సరసన నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement