అందుకే పెళ్లి చేసుకోలేదు: నటి | Sushmita Sen Answers Question on why she is alone | Sakshi
Sakshi News home page

అందుకే పెళ్లి చేసుకోలేదు: నటి

Published Fri, Mar 3 2017 2:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అందుకే పెళ్లి చేసుకోలేదు: నటి - Sakshi

అందుకే పెళ్లి చేసుకోలేదు: నటి

ముంబై: సినీ ఇండస్ట్రీలో నటీమణుల వయసు, పెళ్లి విషయాలు ఎప్పుడూ ఏదో రకంగా చర్చ వస్తున్నాయి. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(41) కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆమెను ఎప్పుడూ వెంటాడే ప్రశ్న.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? సరిగ్గా ఇదే ప్రశ్నను ప్రతి ఈవెంట్లోనూ ఆమెను మీడియా సహా ఆమె సన్నిహితులు అడుగుతుంటారు. అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తనను నిప్పుతో పోల్చుకున్న సుస్మితా.. ఇప్పటివరకూ నిప్పుతో చెలగాటం ఆడేందుకు ఇష్టపడే వ్యక్తి తారస పడలేదని దీటు జవాబును ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

'సింగిల్ గా ఉండటమా.. లేక జంటగా ఉండటమా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయం. ఇతరులు ఒక్కరిగా ఉన్నా, జంటగా ఉన్నా నా అభిప్రాయం ఒకేలా ఉంటుంది. అందరినీ గౌరవించడం నా పాలసీ. ఇప్పటివరకూ నాకు తగిన వ్యక్తి కనిపించలేదు. నిప్పులాంటి తనతో కలిసి జీవించేందుకు ఇష్టపడే వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని' నటి సుస్మితా తన పోస్టులో రాసుకొచ్చింది. ఫిలిప్పీన్స్ లో ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. సింగిల్ గా ఉన్న సుస్మితా రెనీ(16), అలీసా(8)లను దత్తత తీసుకుని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement