Actress Charu Asopa Reveals Rajeev Sen Cheated On Her During Pregnancy, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajeev Sen Divorce: మరోసారి తెరపైకి సుష్మితా సోదరుడి విడాకులు, భర్త వేదిస్తున్నాడంటూ నటి ఆరోపణలు

Published Wed, Nov 2 2022 3:25 PM | Last Updated on Wed, Nov 2 2022 4:31 PM

Actress Charu Asopa Revealed That Rajeev Sen Cheated Her During Pregnancy - Sakshi

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. సుష్మితా తమ్ముడు రాజీవ్‌ సేన్‌ టీవీ నటి చారు అసోపాను 2019లో జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వారికి 11 నెలల కూతురు ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. తాజాగా దీనిపై నటి చారు అసోపా స్పందించింది.

ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త​ రాజీవ్‌ సేన్‌ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది. తన భర్త వల కెరీర్‌ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్‌ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను. పెళ్లయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాను. అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్‌ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని చెప్పింది.

అలాగే ‘‘ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్‌పై దృష్టి పెట్టాను. ‘అక్బర్‌ కా బల్‌ బీర్బల్‌’తో తిరిగి షూటింగ్‌ పాల్గొన్న. అయితే నేను వర్క్‌ చేయడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే రాజీవ్‌ తిరిగి వచ్చాడు. నా వర్క్‌ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్‌ అందరికీ మెసేజ్‌లు పెట్టడం, బెదిరించడం చేశాడు. రాజీవ్‌ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు. దీంతో నేను విడాకులకు అప్లయ్‌ చేశాను. విడాకులు వద్దని, నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్‌ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా. అయినా రాజీవ్‌ తన తీరు మార్చుకోలేదు. కొన్నిరోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement