
కరిష్మా కపూర్, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా మరికొందరు బాలీవుడ్ హీరోయిన్లు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంవైపు కూడా దృష్టి సారించారు. తాజాగా ఈ జాబితాలోకి తన పేరు రాసుకున్నారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. రామ్ మాధ్వనీ దర్శకత్వం వహించిన ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌లో సుస్మితా టైటిల్ రోల్ చేశారు. గత డిసెంబర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరిగింది.
రాజస్థాన్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సుస్మితా కెమెరా ముందుకు వచ్చారు. 2010లో వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత లీడ్ రోల్‌కి నటిగా మేకప్ వేసుకోలేదామె. ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కనిపించబోతున్నారు. ‘‘ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుస్మితా సేన్.
Comments
Please login to add a commentAdd a comment