అప్పటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ ఉన్నవాళ్లు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఏమైందని ఆలోచించేలోపే ప్రాణాలు గాల్లో వదిలేస్తున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తక్షణమే స్పందిస్తే వారిని కాపాడుకోగలమని పరిస్థితి చేయిదాటిపోతే ఏమీ చేయలేమని వైద్యులంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తాను కూడా గుండెపోటుకు గురయ్యానని చెప్తూ బాంబు పేల్చింది.
'మీ గుండెను పదిలంగా కాపాడుకోండి, అప్పుడే అది ఆపత్కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మంచి మాట నాన్న చెప్పేవాడు. కొద్దిరోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. ఆంజియోప్లాస్టీ జరిగింది. స్టంట్ వేశారు. డాక్టర్ ఏమన్నాడో తెలుసా? నాకు విశాలమైన హృదయం ఉందట! ప్రస్తుతం నేను బాగున్నాను.. మిగిలిన జీవితాన్ని కొనసాగించేందుకు రెడీగా ఉన్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. దీనికి గాడ్ ఈజ్ గ్రేట్ అన్న క్యాప్షన్‌ను జోడించింది.
దీనిపై సోఫీ చౌదరి స్పందిస్తూ.. ఓ మై గాడ్.. నీకు అనంతమైన ప్రేమను పంపిస్తున్నాను. నువ్వు, నీ గుండె అన్నింటికన్నా ధృడమైనది అని కామెంట్ చేసింది. మిగతా నెటిజన్లు, సెలబ్రిటీలు సైతం జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మితా సేన్ చివరగా ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించింది. మూడో సీజన్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసింది.
Comments
Please login to add a commentAdd a comment