Actress Sushmita Sen Reveals How Heart Attack Affected Her Life, Deets Inside - Sakshi
Sakshi News home page

Sushmita Sen On Her Heart Attack: ఆ సంఘటన.. నా జీవితాన్ని మార్చేసింది!

Published Mon, Jul 31 2023 6:04 PM | Last Updated on Mon, Jul 31 2023 6:32 PM

Actress Sushmita Sen Talk About Heart Attack - Sakshi

ఇండస్ట్రీలో ఎక్కువగా గుండెపోటు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. యంగ్ యాక్టర్స్ దగ్గర నుంచి సీనియర్ నటీనటుల వరకు ఈ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు కన్నుమూస్తుంటారు. అలా గత కొన్నాళ్ల ముందు ప్రముఖ నటి సుస్మితా సేన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే లక్కీగా దాన్నుంచి ఆమె బయటపడింది. అప్పుడు అసలేం జరిగింది? ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై స్వయంగా సుస్మితానే స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిని బయటపెట్టింది.

ఇది మరో జన్మ
'నా జీవితంలో అది ఓ ప్రమాదకరమైన దశ. దాని నుంచి సురక్షితంగా బయటపడ్డాను. ఇప్పుడు నేను దానికి అస్సలు భయపడను. చెప్పాలంటే ఇది నాకు మరో జన్మతో సమానం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన జీవితంపై గౌరవం పెరుగుతుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది. హార్ట్ ఎటాక్ నా జీవితాన్ని ఎంతో మార్చేసింది.  ఇప్పుడైతే నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: సెట్‌లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!)

ట్రాన్స్‌జెండర్ పాత్రలో
2015 నుంచి దాదాపు ఆరేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న సుస్మితా సేన్.. మళ్లీ ఓటీటీల్లో యాక్టింగ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన 'తాళి' ఫస్ట్ లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో సుస్మిత.. ట్రాన్స్‌జెండర్‌, మానవ హక్కుల కార్యకర్త శ్రీగౌరి సావంత పాత్రని పోషిస్తోంది. దేశంలో హిజ్రాల గుర్తింపు కోసం శ్రీగౌరి చేసిన పోరాటాలని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. త్వరలో ఇది ఓటీటీలోకి రానుంది.

అతడితో రిలేషన్?
తన కంటే చిన్నవాడు అయిన రోహ్మాన్ షోల్ తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేసిన సుస్మితా సేన్.. అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. తాను సుస్మితా సేన్ తో రిలేషన్ లో ఉన్నట్లు బయటపెట్టాడు. కానీ ఈ విషయమై సుస్మితా మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ఇది నిజమా కాదా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement