మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో పలువురితో డేటింగ్ చేసిన ఈ 40 ఏళ్ల భామ తాజాగా వ్యాపారవేత్త, ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. దీంతో సుస్మితా-లలిత్‌ల ప్రేమ వ్యవహారం బి-టౌన్‌లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ విషయంలో సుష్మితాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతోమందితో డేటింగ్ చేసిన ఆమె ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడం ఏంటని అందరిలో నెలకొన్న సందేహం ఇది. ఈ క్రమంలో తన పెళ్లిపై గతంలో ఓ ఇంటర్య్వూలో సుష్మితా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘నేను నా జీవితంలో చాలా ఆసక్తికరమైన పురుషులను కలిశాను. వాళ్లల్లో నెలకొన్న నిరాశ, నిరుత్సాహమే నన్ను పెళ్లిచేసుకోకుండా చేసింది. కానీ, నేను ఎవ్వరితోనైనా రిలేషన్‌లో ఉన్నప్పుడు, నా పిల్లలు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించేరు. చూడటానికి నాకు ఇది కొత్తగా సంతోషంగా కూడా అనిపించేది. అయితే నా లైఫ్‌లో మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యా.. కానీ విధి వల్ల బయటపడ్డ. నన్ను నా ఇద్దరు పిల్లలను దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడనే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా సుస్మితా 24ఏళ్ల వయసులోనే రీనా అనే ఆడపిల్లను దత్తత తీసుకోగా.. 2010లో అలీషా అనే మరో అమ్మయిని దత్తత తీసుకుని వారికి తల్లైంది.
చదవండి: గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి
Comments
Please login to add a commentAdd a comment