
ముంబై: ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్ రాజీవ్ సేన్ దంపతులు శుభవార్త పంచుకున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నటు తెలిపారు. త్వరలోనే తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన చారు అసోపా.. బేబీ బంబ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుంచో ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాం. నేను గర్భవతినయ్యానని తెలియగానే రాజీవ్ చాలా సంతోషించాడు. నిజంగా మాకు ఇదొక సర్‌ప్రైజ్. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. నవంబరులో డెలివరీ ఉంటుందేమో’’ అంటూ నవ్వులు చిందించారు.
ఇక రాజీవ్ సోదరి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘సుస్మిత దీదీ అయితే చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అద్భుతమైన మెసేజ్‌లు పంపిస్తున్నారు. బేబీని చూడటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మా కుటుంబం మొత్తం చిన్నారి రాక కోసం పరితపించిపోతోంది. ప్రస్తుతం నేను బికనీర్‌లో.. మా అమ్మ వాళ్లింట్లో ఉంటున్నా. ముంబైలో పరిస్థితి బాగాలేదు. పైగా అత్తయ్య కూడా మాతోపాటు ఉండటం లేదు.
అందుకే ఇక్కడికి వచ్చాను. రాజీవ్ మాత్రం ముంబైలోనే ఉన్నాడు. రోజురోజుకీ నా శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం ఇది’’ అని చెప్పుకొచ్చారు. కాగా అవివాహితగా ఉన్న సుస్మితా సేన్ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని చాలా ఏళ్ల క్రితమే తల్లిగా మారిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్‌లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీవ్ మోడల్‌గా రాణిస్తున్నాడు.
చదవండి: ఈ ఫోటో.. చిరునవ్వులు తీసుకొచ్చింది : నమ్రత
Comments
Please login to add a commentAdd a comment