Sushmita Sen gives 'kisses' and works out with ex-boyfriend Rohman Shawl - Sakshi
Sakshi News home page

Sushmita Sen: తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో లవ్‌, బ్రేకప్‌.. ఇప్పుడేమో ముద్దులు పంపిస్తోంది!

Published Wed, Apr 5 2023 7:42 PM | Last Updated on Wed, Apr 5 2023 8:01 PM

Sushmita Sen Gives Kisses and Works Out with Ex Boyfriend Rohman Shawl - Sakshi

మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌కు ఇటీవల గుండెపోటు రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్‌ వేశారు. గత నెలలో తాను గుండెపోటుకు గురైన విషయాన్ని వెల్లడించిన సుష్మితా తాజాగా ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. ఇందులో సుష్మితా, ఆమె కూతురు అలీశా, సుష్మిత మాజీ ప్రియుడు రోహ్మన్‌ షాల్‌ ఉన్నారు. వీరందరూ కొన్నిరకాల వ్యాయామాలు చేశారు.

ఈ వీడియోను నటి షేర్‌ చేస్తూ 'సంకల్పం ఒక్కటే మార్గం. మరింత శిక్షణకు అనుమతి లభించింది. నా ప్రియమైన వాళ్లు తిరిగి నేను ఎక్సర్‌సైజ్‌ చేసేందుకు సాయం చేస్తున్నారు. అలీశాకు, రోహ్మన్‌ షాల్‌కు నేను కిసెస్‌ పంపిస్తున్నాను. ఐ లవ్యూ గయ్స్‌..' అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'మీరిద్దరు మళ్లీ కలిసిపోయారు, మిమ్మల్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది, ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి' అని సూచిస్తున్నారు. ఈ వీడియోకు రోహ్మన్‌ షాల్‌ థాంక్యూ టీచర్‌ అని హార్ట్‌ ఎమోజీతో కామెంట్‌ పెట్టడం విశేషం.

కాగా సుష్మితా సేన్‌ తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌తో మూడేళ్లపాటు డేటింగ్‌ చేసింది. తర్వాత అతడికి బ్రేకప్‌ చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానే ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీతో మాల్దీవుల పర్యటనకు వెళ్లడమే కాక సోషల్‌ మీడియా వేదికగా అతడిని పార్ట్‌నర్‌గా ప్రకటించింది. కానీ ఈ బంధం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇలా దాదాపు 10 మందితో డేటింగ్‌ చేసిన ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సుష్మిత ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఆర్య వెబ్‌ సిరీస్‌ మూడో సీజన్‌ చేస్తోంది. మరోవైపు తాలి వెబ్‌సిరీస్‌ డబ్బింగ్‌ పూర్తి చేసింది. ట్రాన్స్‌జెండర్‌ శ్రీగౌరి సావంత్‌ జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement