మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఆమె ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసినట్లు ఆమె తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మితా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది.
చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్
ఈ సందర్భంగా తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘ఇటీవల నేను తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాను. 95 శాతం ప్రధాన రక్తనాళం మూసుకుపోవడంతో ఒక్కసారిగా నొప్పికి కుప్పకూలిపోయాను. దీంతో నన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమించి.. ప్రమాదం నుంచి బయటపడేలా చేశారు. నా కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదు.
చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
కోలుకున్న అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాను. దాన్ని చూసి.. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారు. నాపై ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే నాకు చికిత్స అందించి వైద్యులకు ధన్యవాదాలు. త్వరలోనే ‘ఆర్య-3’ షూటింగ్‌లో పాల్గొంటాను. మీ అందరిని అలరిస్తా’’ అంటూ సుస్మితా చెప్పుకొచ్చిది. అలాగే గడిచిన కొంతకాలంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని , తనపై చూపించినట్టే ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపించండిన ఆమె కోరింది.
Comments
Please login to add a commentAdd a comment