Gold scam
-
కేదార్‌నాథ్‌లో 228 కేజీల గోల్డ్ స్కామ్: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
ముంబై: కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందన్నారు జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి. సుమారు 228 కిలోల బంగారం మాయమైంది దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.కాగా, అవిముక్తేశ్వరానంద ఈరోజు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో థాక్రే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేకు అతిపెద్ద ద్రోహం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే త్వరలో తిరిగి ముఖ్యమంత్రి పదవికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్దవ్‌కు కొందరు నమ్మించి మోసం చేశారు. ప్రజలు అన్నీ గమనించాలి అంటూ కామెంట్స్ చేశారు. VIDEO | Swami Avimukteshwaranand Saraswati, Shankaracharya of Jyotirmath was at 'Matoshree' in Mumbai on request of Shiv Sena (UBT) Chief Uddhav Thackeray. Here's what he said interacting with the media. "We follow Hindu religion. We believe in 'Punya' and 'Paap'. 'Vishwasghat'… pic.twitter.com/AZCJaDfHhi— Press Trust of India (@PTI_News) July 15, 2024 ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు ప్రణామాలు చేశారని, తమ దగ్గరికి వచ్చినవాళ్లను దీవించడం తమ విధానమని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు శత్రువు కాదన్నారు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపుతామని అన్నారు.మరోవైపు.. కేదార్‌నాథ్‌లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు. కేదార్నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించలేం. పన్నెండు జ్యోతిర్లింగాలు నిర్వచించబడ్డాయి. దాని స్థానం స్థిరంగా ఉంది. అది తప్పు అని కామెంట్స్ చేశారు. -
హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు నౌహీరా షేక్
-
హైదరాబాద్: భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై డీఆర్ఐ 2019 కేసు ఆధారంగా హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మీద ఈడీ దాడులు చేస్తోంది. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 డీఆర్ఐ కేసు ఆధారంగా ఈ సోదాలు జరుపుతోంది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలోనే డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ గుర్తించింది. చదవండి: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో .. ఈ వోటింగ్ విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు, 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించారు. ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపకపోవడంతో నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జ్యువెలర్స్ 35 షోరూంలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇదేం విడ్డూరం.. ఊళ్లో లేని వ్యక్తికి కరోనా టీకా! -
రూ.100 కోట్ల బంగారం దారి మళ్లింపు కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బంగారాన్ని దారి మళ్లించి దేశీయ విపణిలో విక్రయించిన ఆరోపణలపై ఘన్‌శ్యామ్‌దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సహా మరికొన్ని సంస్థలపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి ముగ్గురికి చెందిన రూ. 25.28 కోట్ల విలువైన ఆస్తుల్ని బుధవారం తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ కుమార్ అగర్వాల్, రాధిక అగర్వాల్, సంజయ్ కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌కు చెందిన ఖరీదైన విల్లాలతో పాటు 54 కేజీల బంగారం ఎటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. ►అబిడ్స్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఇతరులూ విదేశాలకు ఎగుమతి చేసే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డైమండ్ ఇండియా లిమిటెడ్ సంస్థల నుంచి 250 కేజీల బంగారం ఖరీదు చేశారు. ►ఎక్స్పోర్ట్ చేసే పసిడిపై కస్టమ్స్ సుంకం లేకపోవడాన్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మొత్తం బంగారాన్నిదారి మళ్లించి దేశీయ విపణిలోనే విక్రయించేశారు. దానికి సంబంధించన నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగించారు. ►కోల్‌కతాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయం గుర్తించారు. 2018 ఏప్రిల్ 4న ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. అప్పటికే సంజయ్ అగర్వాల్ హైదరాబాద్ రావడానికి ఇండిగో సంస్థకు చెందిన విమానం ఎక్కేశారు. దీన్ని గుర్తించిన డీఆర్ఐ అధికారులు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద వెనక్కు రప్పించి ఆయన్నూ అరెస్టు చేశారు. అదేరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ కార్గోలో రెండు బాక్సుల్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన 1,194 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ►ఎంఎంటీసీ సహా మూడు సంస్థల నుంచి ఖరీదు చేసిన బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీళ్లు అన్ని పత్రాలు సిద్ధం చేసేవాళ్లు. విమానాశ్రయం వర కు వెళ్లిన తర్వాత ఆ బంగారాన్ని దారి మళ్లించి డొమెస్టిక్ కార్గొ ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చారని డీఆర్ఐ తేల్చింది. దీనికిపై ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాకు చెందిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్లు వివిధ దశల్లో రూ.100 కోట్ల విలువైన 250 కేజీల బంగారం దారి మళ్లించినట్లు తేల్చారు. ►ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఈడీ అధికారులు నగర యూనిట్ సహకారంతో ఈ ఏడాది మార్చిలో ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థతో పాటు శ్రీగణేష్ జ్యువెల్స్, పీహెచ్ జ్యువెల్స్ సంస్థలోదాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనే ఈడీ బుధవారం ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో సంజయ్‌కుమార్ అగర్వాల్‌ను 2012 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. -
8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం
మంగళగిరి : సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన 8కిలోల బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించి.. పలువురిని నిండా ముంచిన ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారం వ్యాపారి పి.దిలీప్‌కుమార్ గత కొన్నేళ్లుగా బంగారు వ్యాపారుల వద్ద బంగారం తీసుకుని వస్తువులు చేసి ఇవ్వడం, చేసిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి నగదు తెచ్చి ఇస్తూ నమ్మకంగా వ్యవహరించేవాడు. శ్రావణమాసం కావడంతో గత 15 రోజుల నుంచి పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు దిలీప్‌కి సుమారు ఎనిమిది కిలోల బంగారం ఇచ్చి వస్తువులు చేయాలని కోరారు. పట్టణానికి చెందిన జి.రమేష్ 180 గ్రాములు, దీపాల బుజ్జి 609, అందె వెంకటసత్యనారాయణ 5000, బిట్రా సుబ్బారావు 1000, మునగాల సురేష్ 180, బేతు సత్యనారాయణ 411, జి.సురేష్ 308, ఎం. చంద్రశేఖర్ 388, దామర్ల వెంకటేశ్వర్లు 200 గ్రాములు.. ఇలా మొత్తం 8కిలోల 276 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే బంగారంతో ఉన్న బ్యాగు విజయవాడలో తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చేసరికి మాయమైందని ఓ లేఖ రాసి ఇంటిలో ఉంచిన దిలీప్ శనివారం నుంచి అదృశ్యమయ్యాడు. సదరు వ్యాపారులకు బంగారం తిరిగి ఇచ్చే స్థోమత తనకు లేదని, బంగారం పోయిన విషయంలో బాధ్యతంతా తనదేనని.. తన తల్లిదండ్రులకు, భార్యకు ఎలాంటి సంబంధం లేదని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సుమారు రూ.4కోట్ల విలువైన బంగారంతో దిలీప్ ఉడాయించడంతో అవాక్కయిన బాధితులు సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.50 కోట్ల బంగారం అమ్మకాల్లో గోల్మాల్..
సాక్షి, విశాఖపట్నం: బంగారం అమ్మకాల్లో తప్పుడు బిల్లులు సృష్టించి పన్నులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన హోల్‌సేల్ వర్తక దుకాణంపై రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు కొరడా ఝుళిపించారు. రూ.50 కోట్ల వరకూ బంగారం కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల్లో తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు రూ.6,56,08,424 చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ వ్యాపార సంస్థ వ్యవహారాన్ని జేసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ సర్కిల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సుంకర శ్రీలక్ష్మి, ఇంటిలిజెన్స్ విభాగాధికారులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మదింపు చేస్తూ.. గుట్టురట్టు చేశారు. ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌సేల్ బంగారు, వెండి వ్యాపార సంస్థ విశాఖలో 2017–18న బ్రాంచ్ ప్రారంభించింది. 2018–19 నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగించింది. ఈ సమయంలో హోల్‌సేల్ ఇన్వాయిస్లను దుకాణాల పేరుతో కాకుండా వ్యక్తుల పేర్లతో చూపించారు. వీటిలో కూడా ఎస్టిమేషన్ స్లిప్స్‌కు, విక్రయ బిల్లుల్లో ఉన్న మొత్తానికి భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ.50 కోట్ల విలువైన బంగారం, వెండి విక్రయాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని జేసీ శ్రీనివాసరావు తెలిపారు. 90 రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
హోల్‌సేల్ బంగారం విక్రయాల్లో భారీగా పన్నుల ఎగవేత
-
గోల్డ్ స్కామ్‌లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఆ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న మహమ్మద్ మన్సూర్‌ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఈ బంగారం కుంభకోణం కేరళ రాజకీయంతో ముడిపడి ఉండడంతో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం మహమ్మద్ మన్సూర్‌ను కొచ్చిలోని ఎన్ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. మన్సూర్‌ను 5 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మన్సూర్ దుబాయ్ నుంచి కుంభకోణం మొత్తం నడిపాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్‌కు తెచ్చేందుకు మన్సూర్ ప్రణాళిక రచించాడని వెల్లడించారు. తిరువననంతపురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్ చిరునామాకు కార్గో ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అరెస్టయిన మన్సూర్ ఏం వివరాలు వెల్లడిస్తాడో.. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కేరళలో హాట్ టాపిక్ కొనసాగుతోంది. -
ఇదో రకం చీటింగ్: కొనక ముందు పుత్తడి.. కొన్నాక ఇత్తడి
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురితో ఏర్పడిన అంతరాష్ట్ర ముఠా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అంటగట్టడం మొదలెట్టింది. ట్రావెల్ ఏజెంట్లు, వ్యాపారుల విజిటింగ్ కార్డ్స్ ఆధారంగా వాళ్లకు ఫోన్లు చేసి ఎర వేస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ నుంచి రూ.17 లక్షలు కాజేసింది. ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం...తరువాత ► కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన శివయ్య (డ్రైవర్), తిరుపతయ్య (రైతు), బి.ఇంద్రాజు (డ్రైవర్) ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం ఏర్పరుచుకుని వారి నుంచి విజిటింగ్ కార్డ్స్ తీసుకుంటారు. ఆపై వారికి ఫోన్లు చేసి తమకు దొరికిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తారు. ► చాంద్రాయణగుట్ట పరిధిలోని రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ కేఎల్ఏ లాజిస్టిక్స్ అండ్ బస్ టిక్కెట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఈయన వద్దకు వచ్చిన ఈ త్రయం విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మరోసారి వచ్చి ఆ టిక్కెట్ కేన్సిల్ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం పెంచుకుని విజిటింగ్ కార్డు తీసుకున్నారు. గత నెల 9న విజయ్‌కుమార్‌కు కాల్ చేసిన ఈ ముఠా సభ్యులు తమకు బంగారం దొరికిందన్నారు. ► మైసూర్ ప్రాంతంలో ఉన్న తమ పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలతో కూడిన లంకె బిందెలు దొరికాయని, ఆ పసిడిని కేజీ రూ.17 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. కావాలంటే మచ్చుకు కొంత ఇస్తామన్నారు.. ఇది జరిగిన నాలుగు రోజులకు బండ్లగూడ ప్రాంతంలో విజయకుమార్‌ను కలిసిన వాళ్లు ఇత్తడితో చేసి, పుత్తడి కోటింగ్ వేసిన ఆభరణం చూపించి నమ్మించారు. పథకం ప్రకారం ముందుగా వాటిలో ఉంచిన అసలు బంగారం ముక్కల్ని తీసి ఇచ్చారు. ► వీటిని బంగారం దుకాణానికి తీసుకువెళ్లిన విజయ్‌కుమార్ పరీక్ష చేయించారు. ఆ సందర్భంలో ఇది నిజమైన బంగారమే అని తేలడంతో ఆయన పూర్తిగా నమ్మారు. ఆపై రూ.17 లక్షలు ఆ ముగ్గురికీ చెల్లించి కేజీ ‘బంగారం’ ఖరీదు చేశారు. ► పది రోజుల తర్వాత కొత్తగా ఆభరణాలు చేయించుకోవడానికి వీటిని తీసుకుని బంగారం దుకాణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అది పుత్తడి కాదని, ఇత్తడని తేలడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. ► దీంతో ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.15 లక్షలు రికవరీ చేశారు. ( చదవండి: శ్వేతను బతికించండి ) -
వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం : మరోసారి సోదాలు
సాక్షి, చెన్నై: వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన చెన్నై రూబీ జువెల్లరీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మరోసారి భారీఎత్తున తనిఖీలు చేపట్టారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం మరోసారి అమీన్ పూర్లో షెల్టర్ తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించింది. 2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యల్లో హైదరాబాద్ అమీన్ పూర్ పోలీస్టేషన్ పరిధి భెల్ మెట్రో కాలనీలో ఇంట్లో నిందితుడు, పరారీలో ఉన్న జ్యువెలర్స్ యజమాని సయ్యద్ ఇబ్రహీంకు పోలీసులు చెక్ పెట్టారు. ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు.. మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా వెయ్యి కిలోలకు పైగా ఖాతాదారులకు బంగారాన్ని మింగేసిన చెన్నైలో రూబీ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని సయ్యద్ ఇబ్రహీం మోసం 2019, మేలో వెలుగులోకి వచ్చింది. వడ్డీ లేని రుణాలకు బదులుగా తాకట్టు పెట్టిన బంగారంపై వడ్డీ లేని రుణాలిస్తానంటూ ఇబ్రహీం నమ్మబలికాడు. బంగారు విలువలో మూడింట ఒక వంతు రుణాలు ఇస్తానని పేర్కొన్నాడు. అయితే డబ్బును తిరిగి ఇచ్చిన తర్వాత కూడా ఇబ్రహీం ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో 1500 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత మూడేళ్లలో 3 వేల మందికి పైగా రూ. 300 కోట్లకు పైగా విలువైన 1,000 కిలోల బంగారాన్ని నిందితులు సేకరించినట్లు అంచనా. -
గోల్డ్ స్కామ్: 303 పేజీల చార్జ్‌షీట్ దాఖలు
తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కీంలో 303 పేజీల చార్జిషీట్‌ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు 25మంది సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశంకర్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఆగస్టు 12, 15న శివ శంకర్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. స్వప్న సురేష్‌తో కలిసి తన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాత్ పాటు ఆయన ఎస్బీఐ జాయింట్ బ్యాంక్ లాకర్ తెరిచారు. గోల్డ్ స్మగ్లింగ్ చేయటంలో స్వప్న సురేష్ కీలక సూత్రధారి అని ఈడీ నిర్థారించింది. స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును, బంగారాన్ని స్వప్న బ్యాంకు లాకర్లలో భద్ర పరచింది. ఇప్పటికే బ్యాంకు లాకర్లను ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి ఏ2 నిందితురాలు స్వప్న సురేష్‌తో తనకు పరిచయం ఉన్నట్టు మాజీ ఐఏఎస్ అధికారి తెలిపారు. స్వప్న కుటుంబం సభ్యులతోనూ మాజీ ఐఏఎస్ కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు శివశంకర్ స్వప్నను ఆర్థికంగా ఆదుకున్నారు. స్వప్నను తన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌కు, శివశంకర్ 2018లో పరిచయం చేశారు. చదవండి: డ్రగ్స్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌కు లింక్! -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. -
చైనాలో భారీ గోల్డ్ స్కామ్!
బీజింగ్: గత దశాబ్ధంలోనే చైనా చరిత్రలో కనివిని ఎరుగని అతి పెద్ద గోల్డ్ స్కామ్ బయటపడింది. చైనా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి విలువలైన లోహాలను తనఖా పెట్టుకొని భారీ మొత్తంలో సొమ్మును కంపెనీలకు ఇస్లుంటాయి. ఈ క్రమంలోనే కింగోల్డ్ జ్యూవెలరీ అనే సంస్థ 14 బ్యాంక్‌ల వద్ద 83 టన్నుల నకిలీ బంగారు కడ్డీలు తాకట్టు పెట్టి 2.8 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది.అయితే ఇవి నకిలీ బంగారు కడ్డీలని తేలింది. ఈ విషయం ఫిబ్రవరిలోనే బయట పడింది. అయితే ఈ బంగారం చైనా ఆ ఏడాది ఉత్పత్తి చేసిన బంగారంలో 22 శాతం, మొత్తం చైనా వద్ద ఉన్న బంగారంలో ఇది 4.2 శాతంగా ఉంది. చైనా ఆర్మీలో పనిచేసిన జియా జిహాంగ్ ఈ కింగ్ జ్యూవెలరీ సంస్థకు చైర్మన్‌గా పనిచేస్తున్నారు. (భారత్‌కు అనుకూలించే విషయాలివే!) ఈ ఏడాది ఫిబ్రవరిలో కింగ్‌గోల్డ్ సంస్థ డాంగ్‌గువాన్ ట్రస్ట్ కో. లిమిటెడ్ (చైనీస్ షాడో బ్యాంక్) కు రుణాలు ఎగవేసినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టిన బంగారు కడ్డీలు పూతపూసిన రాగి మిశ్రమం అని తేలిందని డాంగ్‌గువాన్ ట్రస్ట్ తెలిపింది. ఈ వార్తతో కింగ్ జ్యూవెలర్స్‌కు అప్పు ఇచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో చైనా అపకీర్తిపాలైంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.చైనా భారత్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’) ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, మార్చి 31, 2020 నాటికి మొత్తం 1,948.30 టన్నుల నిల్వలతో చైనా ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 8,134 టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, జర్మనీ, ఇటలీ 3,364 టన్నులు, 2,452 టన్నులు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. 642 టన్నుల బంగారు నిల్వలతో టాప్ 10 దేశాల జాబితాలో భారత్ కూడా ప్రవేశించింది. -
బంగారం రాకెట్ ఎత్తులకు..డీఆర్ఐ చెక్
సాక్షి, హైదరాబాద్: చెన్నై నుంచి ఓరుగల్లుకు విదేశీ బంగారాన్ని అత్యంత రహస్యంగా తరలిస్తోన్న రాకెట్ గుట్టును డీఆర్ఐ అత్యంత చాకచక్యంగా ఛేదించింది.ముఠా వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారికి చెక్ చెప్పింది. కేవలం రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరిపిన దాడుల్లో అధికారులు రూ.13 కోట్ల విలువైన 31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషా బాద్ విమానాశ్రమంలో ఆధునిక స్కానర్లు పెరి గిన దరిమిలా.. దొంగబంగారం రవాణా చైన్నైకి మార్చారు స్మగ్లర్లు. ఈ నేపథ్యం లో ఎలాంటి రశీదులు లేకుండా తక్కువ ధరకు దొరికే విదేశీ పుత్తడిని మన వ్యాపారులు చెన్నైలోని బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? జనవరి 31 చెన్నై నుంచి వరంగల్ వెళ్లే ట్రైన్‌నెం 12969 జైపూర్ ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3.05 కోట్ల విలువైన 7,228 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నా రు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేశారు. తాము ఆ బంగారాన్ని చెన్నైలో కొని, వరంగల్‌కు తీసుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 1న విజయవాడ రైల్వేస్టేషన్లో అదే తరహాలో మరికొందరు డీఆర్ఐకి చిక్కారు. చెన్నై నుంచి వరం గల్ వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో చేపట్టిన తనిఖీ ల్లో వారి వద్ద రూ.2.99 కోట్ల విలువైన 7055 గ్రాముల బంగారం లభించింది. స్వాధీనం చేసుకున్న బంగారం -
కెనరా బ్యాంకులో కొనసాగుతున్న విచారణ
మచిలీపట్నం : స్థానిక కెనరా బ్యాంకులో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు నగలు మాయమయ్యాయని ప్రచారం ఇటీవల జరిగింది. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న జి.శ్రీరామసుబ్రహ్మణ్యం బంగారు నగలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గత నెల 28వ తే దీన బ్యాంకు డీజీఎం కే సుశీల, బ్యాంకు చీఫ్ సెక్యూరిటీ అధికారి వి.ప్రసాద్ బ్యాంకుకు వచ్చి విచారణ చేశారు. అధికారులు నాలుగు రోజులుగా బంగారు నగల మాయంపై విచారణ చేస్తున్నారు. బంగారు నగల తాకట్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన బంగారు నగలపై ఆరా తీసి వాటిని చూపాలని కోరారు. సోమవారం బ్యాంకుకు వచ్చిన ఖాతాదాలకు వారి వద్ద స్లిప్పుల ఆధారంగా తనిఖీ చేసి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై బ్యాంకు అధికారుల నుంచి ఇంకా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్‌పేట ఎస్ఐ హబీబ్ బాషా ‘సాక్షి’కి తెలిపారు. అప్రైజర్ శ్రీరామసుబ్రహ్మణ్యం కెనరాబ్యాంకు నుంచి నగలను తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్, మరో బ్యాంకులో కుదువ పెట్టారని విశ్వసనీయ సమాచారం. కెనరా బ్యాంకు అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
‘గోల్డ్ స్కామ్’లు రూ.6510 కోట్లకు పైనే
అందరికీ న్యాయం జరిగేలా చర్యలు: సీఐడీ చీఫ్ సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫర్మ్స్ అండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.6,510 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులను రూ.6,380 కోట్ల మేర మోసగించిందన్నారు. అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సైతం ఇదే తరహాలో ప్రజల నుంచి రూ.130 కోట్లు సేకరించినట్లు గుర్తించామన్నారు. బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు.