
కన్నతండ్రే కాలయముడు
అనుమానంతో కుమార్తెపై తండ్రి కత్తితో దాడి
హాస్పటల్‌కు తరలిస్తుండగా మృతి
ఉత్తరచిరువోలులంక (మోపిదేవి) : వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తండ్రే కాలయముడయ్యాడు. కన్నకుమార్తెపై కత్తితో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మోపిదేవి మండలం ఉత్తరచిరువోలులంకకు చెందిన నడకుదుటి మాధవి (35)పై తండ్రి చింతా వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం కత్తితో దాడిచేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను చూసి తండ్రి కూడా సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు హాస్పటల్‌కు తరలించారు. 108లో మాధవిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరిలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సమాచారం అందుకున్న అవనిగడ్డ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వెంకట్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
మనమరాలి వివాహం ఆగిపోవడానికి కుమార్తె కారణమని..
మృతురాలి మాధవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెండ్లి సంబంధం రాగా మాధవి ప్రవర్తన వల్లే చెడిపోయిందని, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని తండ్రి వెంకటేశ్వరరావు హెచ్చరించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం మృతురాలి ఇంటివద్ద వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో మాధవి గొడవపడుతుండగా తండ్రి కల్పించుకోవడంతో తోపులాట జరిగిందని, ఆవేశంతో తం డ్రి కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడని సమాచారం. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పరారైనట్లు తెలిసింది.
పుట్టింటి వద్దే ఉంటూ..
మాధవిని తొలుత గ్రామంలో బంధువుకే ఇచ్చి వివాహం చేయగా కొద్దికాలంలోనే అతనికి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఆమె కోరుకున్న వ్యకి ్తతో స్థానిక పెద్దలు రెండో వివాహం చేశారు. అతనితో ఇద్దరు ఆడపిల్లలను కన్న తరువాత గొడవలు పడి పుట్టింటి వద్దనే ఉంటూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తోంది. మాధవి మృతి చెందగా ఆమె కుమార్తెలు ఇద్దరూ తల్లిదండ్రులకు దూరం అయి అనాధలుగా మిగిలిపోయారని గ్రామస్తులు విచారం వ్యక్తంచేస్తున్నారు.