
సాక్షి, విజయవాడ: హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామరావుతో కలిసి హాయల్యాండ్‌పై కుట్ర చేశాడనే అభియోగంపై అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు గతంలో అగ్రిగోల్డ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. అతడు 2005 ఆగస్టు 29న హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్ కాలేజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్వరరావు అరెస్ట్‌తో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. గురువారం వెంకటేశ్వరరావును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment