మార్మోగిన సమైక్య నాదం
Published Wed, Feb 12 2014 2:32 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్జీవోలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరో రోజుకు చేరింది. పంచాయతీరాజ్, సబ్ ట్రెజరీ మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు లేక కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. విధులకు హాజరు కాని ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికలను ఆయా శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం కలెక్టరేట్‌కు పంపుతున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు ఇప్పటికైనా తెలంగాణ బిల్లును అడ్డుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎన్జీవోలు హెచ్చరించారు. బైక్‌లపై ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను, పలుచోట్ల పెట్రోల్ బంకులను మూయించివేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ నాయకులు టి.యోగానందం, ఆర్‌ఎస్ హరనాథ్, కె.రమేష్‌కుమార్, సతీష్, నెర్సు రామారావు, క్రిష్టవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ర్యాలీలు.. రాస్తారోకోలు
భీమవరం ప్రకాశ్ చౌక్‌లో విద్యార్థులు, ఎన్జీవోలు, సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకులు పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను మూయించివేశారు. కేంద్ర మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. తణుకులో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి, పెట్రోల్ బంకులను ఎన్జీవోలు మూయించివేశారు. సాయంత్రం నరేంద్ర సెంటర్‌లో దిగ్విజయ్‌సింగ్, షిండే దిష్టి బొమ్మలను దహనం చేశారు. పెనుగొండలో విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రాజ్యసభలో విభజన బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నిడదవోలు సినిమా హాల్స్‌లో ఉదయం ఆటను ఎన్జీవోలు నిలిపివేరుుం చారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఓవర్ బ్రిడి ్జసెంటర్‌లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో దుకాణాలను, సినీ థియేటర్లను, మండల పరిషత్ కార్యాలయాన్ని మూయించివేశారు. చాగల్లు, తాళ్లపూడిలలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు.
పాలకొల్లులో వ్యాపార, విద్యాసంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులను సమైక్యవాదులు, ఎన్జీవోలు మూయించేశారు. దీంతో పట్టణంలో బంద్ వాతావరణం నెలకొంది. గాంధీబొమ్మల సెంటర్‌లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గారపాటి గోపాలరావు, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో పెట్రోల్ బంకులను మూయించారు. గోపాలపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆకివీడులో సినిమా థియేటర్లలో రెండు ఆటలను నిలుపుదల చేశారు. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డారుు. భీమడోలు మండలం పొలసానిపల్లి గీతాంజలి కళాశాల విద్యార్థులు భీమడోలు సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. నమూనా రాజ్యసభ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. చింతలపూడిలో బంద్ జరిగింది. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లను మూయించివేశారు. బోసుబొమ్మ సెంటర్లో రాస్తారోకో చేశారు.
Advertisement
Advertisement