ఘన జీవామృతం..
దుక్కిలో ఎకరాకు వంద కిలోల ఘన జీవామృతాన్ని వేస్తే డీఏపీలాంటి ఎరువుల అవసరం ఉండదు. ట్రాక్టర్ పశువుల పేడలో 50 లీటర్ల ఆవు మూత్రం, 16 కిలోల బెల్లం, 16 కిలోల శనగపిండి, 4 కిలోల పుట్ట మట్టిని బాగా కలిపి పైన నీళ్లు కొద్దిగా చల్లి 15 రోజుల పాటు మాగపెట్టాలి. ఆ తర్వాత ఆ ఎరువును ఉపయోగించుకోవచ్చు.
జీవామృతాన్ని రెండు కిలోల చొప్పున బెల్లం, శనగపిండి, 5 నుంచి పది కిలోల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, పిడికెడు పుట్టమట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం సాయంత్రం కలుపుతూ రెండు రోజులు నానబెట్టాలి. దానికి మరో 200 లీటర్ల నీరు కలుపుకోవాలి. మూడో రోజు నుంచి 15 రోజుల్లోపు వాడుకోవాలి. ఆ జీవామృతాన్ని పైరుపై పిచికారీ చేయడానికి లీటర్ నీటికి 20 మి.లీ. కలుపుకోవాలి. దీంతో చీడపీడలు దరిచేరవు. మొక్కకు 10 మి.లీ. చొప్పున నేరుగా పోసుకోవచ్చు.
దీంతో యూరియా అవసరమే ఉండదు. పదిహేనురోజులకోసారి పైరుపై పిచికారీ చేసుకోవడంతో పాటు మొక్కకు నేరుగా ఇదే తరహాలో అందిస్తే పంట దిగుబడి ఆశించిన విధంగా వస్తుంది. బంతి పూల వంటి పంటకు ఎకరాకు 15 రోజులకు వెయ్యి లీటర్ల జీవామృతం సరిపోతుంది. వరి పైరుకు 600 లీటర్ల జీవామృతాన్ని నెలకోసారి నీటి ద్వారా పారిస్తే సరిపోతుంది. అవసరాన్ని బట్టి అగ్నిఅస్త్రం, పుల్లటి మజ్జిగను పైరుపై పిచికారీ చేయాలి.
ఐదెకరాల్లో ఏడాదికి రూ.3 లక్షల ఆర్జన..
సచివాలయ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావుకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఆయన సూచనలతో రెండేళ్ల నుంచి సేంద్రి య సాగు చేపట్టాను. చాలా బాగా అనిపించింది. ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు 5 ఎకరాల్లో ఏడాదికి పెట్టుబడి పోను రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ఒక దేశీయ ఆవుతో 5 ఎకరాల్లో ఈ తరహా సాగు చేపట్టవచ్చు. చాలా సులభమైన విధానం ఇది. చాలా మందిని ప్రోత్సహిస్తున్నాను. అధికారుల ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నాను. ఆయా పద్ధతులను ఇతర రైతులకు చూపిస్తున్నాను.
రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి
Published Mon, Sep 8 2014 10:26 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement