ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో రైతులు రసాయన ఎరువులు వాడి లాభాల కంటే నష్టాలే చవిచూస్తున్నారు. అదే సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. వానపాముల వ్యర్థ పదార్థాలతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ విధానం, వానపాముల అభివృద్ధి గురించి వివరించారు.
వర్మీకంపోస్టు తయారీ విధానం
కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి.
అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే ‘సీడ్’ తయారీపై దృష్టి పెట్టాలి. వ ర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా ‘సీడ్’ తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని.
నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటాం. సాధారణంగా ఈ వర్మీబెడ్‌పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది.
దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తాం. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి. అయితే ఈ విధానం సీడీ తయారీకి అనుకూలం కాదు.
వానపాముల అభివృద్ధి ఇలా..
కుండీల్లో ‘వర్మీబెడ్’ వేసిన తర్వాత ఒక కుండీలో చిన్న భాగంలో ఎండిన పేడ చిన్నచిన్న ఉండలుగా బెడ్‌పై సమానంగా 1/2 అంగుళం ఎత్తున వేయాలి. రోజు క్యాన్‌తో బాగా తడిపి చదరపు మీటర్‌కు కేజీ వానపాముల విత్తనం చల్లాలి. తినే పదార్థం చాలా తక్కువగా ఉండడంతో కేవలం 20 రోజుల్లో వర్మీకంపోస్టు 1/2 అంగుళం ఎత్తున తయారవుతుంది. దీనిని సేకరించరాదు.
దీనిపై మరో 1/2 అంగుళం ఎత్తున ఎండిన పేడ పలచగా వేసి తడపాలి. ఈసారి మరో పది రోజులల్లోనే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇలా ప్రతీ పది రోజులకు 1/2 అంగుళం ఎత్తున పశువుల పేడ వేసి తయాైరె న ఎరువును ఎత్తకుండా ఉంచితే కుండీ పైభాగం వరకు చేరేందుకు సుమారు 70 రోజులు పడుతుంది. దీనిలో సమృద్ధిగా ‘కకూన్స్’ వానపాములు చిన్న పిల్లలు చాలా అధికంగా ఉంటాయి. దీనిని సేకరించి మరో కొత్త ప్రదేశంలో వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవచ్చు.
గమనించాల్సిన విషయాలివి..
{పతీ కకూన్‌కు (గుడ్లు) నాలుగు నుంచి ఆరు వానపాములు వస్తాయి.
90 రోజుల వయస్సు కలిగిన పెద్ద వానపాములు తన క్రైటెల్లం (గుడ్ల శేరు) నుంచి ప్రతి 15 రోజులకోకసారి ఒక కకూన్ విడుదల చేస్తుంది.
90 రోజుల తర్వాత నుంచి రెండేళ్ల వరకు ప్రతీ 15 రోజులకు ఒక కకూన్ చొప్పన సుమారు 168 నుంచి 252 వానపాములు పెరుగుతాయి.
వీటిలో ప్రతీ వానపాము 90 రోజుల వయసు వచ్చిన తర్వాత మళ్లీ 168 నుంచి 252 రేట్లు పెరిగేందుకు దోహదపడతాయి. వీటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది.
‘సీడ్’ పెద్దవి కాకుండా వేరే కుండీల్లోకి తరలించాలి. పెద్ద వానపాములు వలస (మైగ్రేషన్) తట్టుకోలేవు. చిన్నచిన్న పాములు, కకూన్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వీటిని ప్లాస్టిక్ తొట్టెల్లో కూడా సేకరించి ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేయవవచ్చు.
వానపాములు కకూన్స్ బాగా ఫలప్రదం. (హేచింగ్) కావడానికి ప్రతీ 30 రోజులకోసారి పశువుల మూత్రం 1:10 నిష్పత్తిలో నీరు కలిపి బెడ్స్‌పై గోనెలు తడపాలి. నీరు అధికంగా పోయకూడదు. గోనె తట్టును మాత్రమే తడిగా ఉండేటట్టు తడిపితే సరిపోతుంది.
ఏడాది పొడుగునా కకూన్స్ ఉన్నా శీతాకాలంలో కకూన్స్ పెట్టేందుకు, అవి హెచ్ అయ్యేందుకు మరింత అనుకూలం.
సీడ్ పెంచే కుండీలు ప్రతీ ఆరునెలలకోసారి శుభ్రం చేయాలి. వర్మీబెడ్‌ను కూడా మార్చి కుండీ రెండు రోజులు డ్రై (ఆరబెట్టాలి) చేయాలి.
సేంద్రియ సాగు మేలు
Published Fri, Nov 28 2014 2:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement