బూరుగుపూడి(మధురపూడి) : కోరుకొండ మండల బూరుగుపూడి రైతు సహకార సేవా సంఘంలో సీఈఓ(కార్యదర్శి)గా పని చేస్తున్న తన భర్త బోలగొండ వెంకటేశ్వరరావు కనిపించడం లేదని భార్య వెంకటగిరి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహ సందర్భంగా తన భర్త వెంకటేశ్వరరావు సెలవు పెట్టారని, సెలవులో ఉండగానే తన భ ర్తను సస్పెండ్ చేశారని ఆమె వాపోయారు. కాగా సొసైటీలో ఆర్థిక లావాదేవీలకు నా భర్తను, గుమస్తాను బాధ్యులను చేసి ఏకపక్షంగా సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే శ్రీరంగపట్నం సొసైటీలో చేరడానికి అక్కడి అధ్యక్షులు అంగీకరించారని, కాని బూరుగుపూడి సొసైటీ అధ్యక్షుడు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా బూరుగుపూడి సొసైటీ నుంచి రెండు నెలలగా జీతం కూడా రావడం లేదని, ఉద్యోగం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, దీంతో నా భర్త తీవ్ర నిరాశతో మనోవేదనకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. దీంతో అక్టోబర్ 28 తేదీ తెల్లవారు జామున ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోయారని, సాయంత్రం వరకూ చూసి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నారా? అని అడగగా సమాధానం లేదని ఆమే తెలిపారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదని ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, తనకు, తనకుటుంభానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
‘‘నా భర్త కనిపించడం లేదు’’
Published Mon, Nov 3 2014 12:40 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement