husband missing
-
భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..?
పొన్నూరు(గుంటూరు జిల్లా): భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో జయచిత్ర నాగరాజు అదృశ్యమయ్యాడు. భార్యే వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడిని హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నాగరాజు మేనల్లుడు జి.ఏడుకొండలు కథనం ప్రకారం.. పట్టణంలోని 2వ వార్డులో నివాసం ఉంటున్న జలచిత్ర నాగరాజు అలియాస్ ఆది, అతని భార్య సోని స్వస్థలం నెల్లూరు జిల్లా బిట్రగుంట. వీరిద్దరూ 8ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం నాగరాజు కుటుంబం పొన్నూరు వచ్చింది. నాగరాజు కారు డ్రైవర్. కొంతకాలంగా నాగరాజు, సోనీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చదవండి: ‘భార్యలను మార్చుకునే’ రాకెట్ గుట్టురట్టు! ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి నాగరాజు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో నాగరాజు తొడల్లుడు ఆదివారం సాయంత్రం బంధువులకు ఫోన్ చేసి నాగరాజును అతని భార్య హత్య చేయించిందని చెప్పాడు. దీంతో బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి నాగరాజు భార్య సోనీని విచారించారు. ఇంటిలో రక్తపు మరకలు ఉండటంతో నాగరాజు బంధువుల అనుమానం బలపడింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. జాగిలాలు నాగరాజు ఉంటున్న ఇంటి నుంచి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాల ఏరియాలోని పొలాల్లోకి వెళ్లి నిలిచిపోయాయి. రాత్రి సమయం కావటంతో అవి ముందుకెళ్లలేకపోయాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనే నాగరాజును సోనీ హత్య చేయించి కారులో బాపట్ల సమీపాన ఉన్న కాలువ వద్దకు తీసుకెళ్లి అందులో మృతదేహన్ని పడవేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. నాగరాజు బంధువుల ఫిర్యాదు మేరకు పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో!
సాక్షి, మల్కాజిగిరి: మౌలాలి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాకేష్(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్‌లో విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్‌ఫోన్ స్టేటస్‌లో మరొక అమ్మాయితో ఉన్న ఫొటోను రాకేష్ భార్య అశ్విని గమనించి ఫోన్ చేసింది. ఇంటికి వస్తున్నాని చెప్పిన రాకేష్ రాలేదు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ మిర్జాలగూడకు చెందిన దొడ్డి మల్లేష్ కుమారుడు మహేష్(19) ఈనెల 19వ తేదీ సెలూన్‌షాపు నిర్వహించే మల్లేష్‌కు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోతే ఫోన్ చేస్తే ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘‘నా భర్త కనిపించడం లేదు’’
బూరుగుపూడి(మధురపూడి) : కోరుకొండ మండల బూరుగుపూడి రైతు సహకార సేవా సంఘంలో సీఈఓ(కార్యదర్శి)గా పని చేస్తున్న తన భర్త బోలగొండ వెంకటేశ్వరరావు కనిపించడం లేదని భార్య వెంకటగిరి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహ సందర్భంగా తన భర్త వెంకటేశ్వరరావు సెలవు పెట్టారని, సెలవులో ఉండగానే తన భ ర్తను సస్పెండ్ చేశారని ఆమె వాపోయారు. కాగా సొసైటీలో ఆర్థిక లావాదేవీలకు నా భర్తను, గుమస్తాను బాధ్యులను చేసి ఏకపక్షంగా సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే శ్రీరంగపట్నం సొసైటీలో చేరడానికి అక్కడి అధ్యక్షులు అంగీకరించారని, కాని బూరుగుపూడి సొసైటీ అధ్యక్షుడు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా బూరుగుపూడి సొసైటీ నుంచి రెండు నెలలగా జీతం కూడా రావడం లేదని, ఉద్యోగం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, దీంతో నా భర్త తీవ్ర నిరాశతో మనోవేదనకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. దీంతో అక్టోబర్ 28 తేదీ తెల్లవారు జామున ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోయారని, సాయంత్రం వరకూ చూసి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నారా? అని అడగగా సమాధానం లేదని ఆమే తెలిపారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదని ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, తనకు, తనకుటుంభానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.