ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా.. సినీ ఫక్కీలో పారిపోయాడో అవినీతి అధికారి. సినిమా స్టోరీని తలపించిన.. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ఆర్ అండ్ బీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు నగరంలోని ఏటీఆగ్రహారం జీరోలైన్‌లో నివాసం ఉంటున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపణలు రావటంతో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, విషయం ముందుగానే పసిగట్టిన వెంకటేశ్వరరావు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లాడో తేలక పోవడంతో.. అధికారులు అతని నివాసం వద్దే విచి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.