తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సటీ నాలుగో స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు వీసీ దేవనాథన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన వేద విద్వాంసుడు విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రికి గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలిపారు. మహతి ఆడిటోరియంలో జరిగే ఈ స్నాతకోత్సవంలో 93 మందికి శాస్త్రి, 154 మందికి ఆచార్య, ముగ్గరురికి ఎంఫిల్, ఇద్దరికి పీహెచ్‌డీ, నటుగురికి బీఏ, 25 మందికి బీఎస్సీ, 6 మందికి ఎంఏ, 80 మందికి డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు డిగ్రీ ప్రదానం చేస్తామన్నారు. అదే రోజున వర్సిటీ 11 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
రేపు వేదిక్ వర్సిటీ స్నాతకోత్సం
Published Tue, Jul 11 2017 10:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
Advertisement
Advertisement